S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/20/2016 - 18:00

ఢిల్లీ : మంగళవారం నుంచి 27వ తేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీం కోర్టు కర్నాటకకు ఆదేశించింది. గతంలో ఒకసారి 15 వేలు, 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే న్యాయస్థానం తన తీర్పును కొనసాగిస్తూ నీటి పరిమాణాన్ని కాస్త తగ్గించింది.

09/20/2016 - 17:58

ఢిల్లీ: కాశ్మీర్‌లో 74 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూకు తెరపడింది. శ్రీనగర్‌లోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మినహా కాశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూను మంగళవారం ఎత్తివేశారు. హిజ్‌బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భారత సైన్యం మట్టుబెట్టిన అనంతరం జమ్ముకశ్మీర్‌లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ప్ర‌స్తుతం కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

09/20/2016 - 17:56

ఢిల్లీ : తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు ఢిల్లీలో బుధవారం జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతున్నారు. జలవివాదాల పరిష్కారం దిశగా కేంద్రం చొరవ తీసుకునే వీలుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది.

09/20/2016 - 17:48

దిల్లీ: కావేరి పర్యవేక్షక కమిటీ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రేపటి నుంచి ఈనెల 27 వరకు రోజుకు 6వేల క్యూసెక్కుల కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించింది.

09/20/2016 - 16:59

ఢిల్లీ: విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ వియన్నా పర్యటనను కుదించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. వెంటనే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉరీ ఉగ్రదాడులకు దౌత్యపరంగా జవాబు చెప్పాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉండటంతో జైశంకర్ తన పర్యటన కుదించుకుని హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు.

09/20/2016 - 16:43

దిల్లీ: ఐఆర్‌ఎస్‌ అధికారులకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌లో అవకాశం కల్పిస్తామని, ఎంత నిష్పత్తిలో వీరు ఉండాలి అనే అంశాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం అన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ శాఖ కూడా జీఎస్‌టీలో కీలకమని, అధికారులకు స్థానం కల్పించడంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు.

09/20/2016 - 16:38

దిల్లీ: స్మార్ట్‌సిటీల మూడో జాబితాలో తిరుపతి చోటు దక్కించుకుంది. స్మార్ట్‌సిటీల మూడో జాబితాలో మొత్తం 27 నగరాలు చోటు సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమరావతి, విశాఖ ఇప్పటికే స్మార్ట్‌ జాబితాలో చేరగా, మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేసిన జాబితాలో తిరుపతి స్థానం సంపాదించింది.

09/20/2016 - 16:33

దిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే సాహిరామ్‌ పహిల్వాన్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. యోగేశ్‌ అనే వ్యక్తిని గాయపరిచిన విషయంలో ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్‌లు 324, 341, 34 కింద కేసు నమోదు చేశారు. యోగేశ్‌ అనే వ్యక్తి ఇంటి ముందు సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సాహిరామ్‌ రోడ్డు నిర్మిస్తున్న సూపర్‌వైజర్‌ను పిలిచి నిర్మాణ పనులను ఆపేయమని బెదిరించాడు.

09/20/2016 - 16:01

అమృత్‌సర్: విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ కాలువలోకి దూసుకుపోవడంతో అయిదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా పదిమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలోని అట్టారి వద్ద జరిగింది. 50 మంది స్కూలు పిల్లలతో వస్తున్న బస్సు ముహావా కాలువలో బోల్తాపడిందన్న వార్త తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.

09/20/2016 - 16:00

హైదరాబాద్: లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై చెక్‌బౌన్స్ కేసును హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది. జిఎంఆర్ సంస్థకు 50 లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ కావడంతో మాల్యాతో పాటు ఎ.రఘునాథన్‌ను కోర్టు దోషులుగా నిర్ణయించింది. మాల్యా చాలాకాలంగా కోర్టు విచారణకు రావడం లేదు. రఘునాథన్ కూడా మంగళవారం కోర్టుకు రాలేదు.

Pages