S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/20/2016 - 14:48

ఢిల్లీ : పాక్‌ దుశ్చర్యలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. బెంగుళూరులో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళి అర్పిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అమర జవాన్లకు నివాళి అర్పిస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయిక్‌ రూపొందించారు.

09/20/2016 - 14:22

బాలాసోర్‌ (ఒడిశా ) : చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని అధికారులు తెలిపారు.

09/20/2016 - 14:18

శ్రీనగర్‌: శ్రీనగర్‌ విమానాశ్రయంలో మంగళవారం రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో మిగ్‌-21 విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. రన్‌వే ధ్వంసమైంది. దీంతో శ్రీనగర్‌కు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.

09/20/2016 - 13:32

ఢిల్లీ: యురిలో ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరించడానికి త్వరలో యురికి వెళ్లనుంది. జమ్ము కశ్మీర్లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, 20 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్థాన్కు సంబంధముందని ఆధారాలు లభించాయి.

09/20/2016 - 13:28

ఢిల్లీ : దేశ రాజధానిలో మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ మహిళను 34 ఏళ్ల సురేందర్ 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్‌గా పనిచేసేది. సురేందర్ ఆమెను వేధిస్తుండేవాడు. సురేందర్‌కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా కేసు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

09/20/2016 - 12:12

ఢిల్లీ : అక్రమంగా నియామకాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌పై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలుచేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కూడా ఈ కేసులో నోటీసులు ఇస్తామని ఏసీబీ చీఫ్ ఎంకే మీనాచెప్పారు. స్వాతిని ఏసీబీ అధికారులు 27 ప్రశ్నలు చేతికిచ్చి, వాటికి వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు.

09/20/2016 - 11:59

కోల్‌కత: కోల్‌కత నుంచి గౌహతికి వెళ్లే విమానంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకురాలి నుంచి ఫోన్ రావడంతో పోలీసు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం 8 గంటలు దాటాక ఓ మహిళ నుంచి ఆ ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసి బాంబు స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు ప్రారంభించారు.

09/20/2016 - 11:47

విజయవాడ: ఏపీలో ఆరోగ్యశాఖకు చెందిన రెండు పథకాలను ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన మహిళలకు హెల్త్‌ చెకప్‌, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు బేబి కిట్స్‌ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. పలువురు బాలింతలకు చంద్రబాబు బేబి కిట్స్‌ అందజేశారు.

09/20/2016 - 08:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూరి సెక్టార్‌లో 20మంది వీరజవాన్లను బలి తీసుకున్న ఉగ్రవాద ఘటన అసలు ఎలా సంభవించింది. భారత, పాక్ సరిహద్దులో అత్యంత వ్యూహాత్మకమైన సైనిక స్థావరంగా చెప్పుకునే యూరిలో సైనికులు విశ్రాంతి తీసుకునే శిబిరాల దాకా ఉగ్రవాదులు ఎలా చొచ్చుకురాగలిగారన్న దానిపై సైనిక ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. సెక్యూరిటీ లోపాలు ఎక్కడ జరిగాయన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.

09/20/2016 - 08:12

జెనీవా/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: జమ్మూకాశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అంతర్జాతీయ వేదికలపై ఆరోపిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఎదురుదెబ్బ. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్రానికి చెందిన నేత బ్రహుమ్‌దగ్ బుగ్తి భారతదేశ ఆశ్రయం కోరుతానని సోమవారం ప్రకటించారు.

Pages