S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/19/2016 - 06:05

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సిబిఐ) గత పదేళ్లలో ఏడు వేల కేసులను అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తే ఇందులో 6533 కేసుల్లో కోర్టు విచారణ ముగిసింది. ఇందులో 4054 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష ఖరారైంది.

09/19/2016 - 03:14

యూరి, సెప్టెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన మిలిటెంట్లుగా భావిస్తున్న సాయుధ మిలిటెంట్లు ఆదివారం తెల్లవారుజామున బారాముల్లా జిల్లా యూరి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై గ్రెనేడ్లు, ఎకె రైఫిళ్లతో దాడి చేయడంతో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

09/19/2016 - 03:10

రేణిగుంట, సెప్టెంబర్ 18: స్పైస్ జెట్ విమానం ప్రమాదానికి గురైన సంఘటనతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు ఆదివారం కూడా రద్దయ్యాయి. శనివారం రాత్రి స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ అయి యు టర్న్ తీసుకునే సమయంలో రన్ వే నుంచి సుమారు 120 మీటర్లు మట్టిలోకి వెళ్లడంతో విమానం టైర్లు బురదలో కూరుకుపోయాయి.

09/19/2016 - 02:32

పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు తగ్గక ముందే పాకిస్తాన్ ముష్కర మూకలు మరోసారి భారత సైనిక స్ధావరంపై తెగబడ్డాయి. నిషిద్ధ జైషే మొహమ్మద్ సాయుధ ఉగ్రవాదులు యూరీలోని భారత సైనిక కేంద్రంపై ఆదివారం జరిపిన దాడిలో 17మంది సైనికులు మరణించారు. ఆదివారం తెల్లవారు జామున ఐదున్నరకు జరిగిన ఈ విఘాతక దాడిలో మరో 20మంది సైనికులు గాయపడ్డారు.

09/19/2016 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో ఖండించారు. ఈ గర్హనీయ, పిరికిపందల చర్యకు పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఉగ్రవాద దాడిలో మరణించిన సైనికుల్ని దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ ధనులుగా అభివర్ణించి వారికి అభివాదం చేశారు.

09/19/2016 - 02:05

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూరి సెక్టార్‌లోని సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిని అత్యంత గర్హనీయ, విఘాతక చర్యగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించేవారిని కుత్సిత లక్ష్యాలను వమ్ము చేస్తామని, ఇలాంటి చర్యలకు భారత్ తలవంచేది లేదని, గట్టిగా తిప్పికొడతామని పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండా రాష్టప్రతి హెచ్చరించారు.

09/19/2016 - 02:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి)చైర్మన్‌గా మాజీ ఐఎఎస్ అధికారి అల్కా సిరోహి నియమితమయ్యారు. మంగళవారం పదవీ విరమణ చేస్తున్న దీపక్ గుప్తా స్థానే సిరోహీ నియమితమయ్యారు. 21న ఆమె పదవీ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం యుపిఎస్‌సి కమిషన్ సభ్యురాలిగా సిరోహీ కొనసాగుతున్నారు. ఈ తాజా నియామకం వచ్చే ఏడాది జనవరి మూడో తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ కొనసాగుతుంది.

09/19/2016 - 01:53

చెన్నై, సెప్టెంబర్ 18: కొన్ని నెలల క్రితం స్వాతి అనే 24 ఏళ్ల ఐటి ఉద్యోగినిని దారుణంగా హతమార్చిన నిందితుడు టి. రామ్‌కుమార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో రామ్‌కుమార్ పుంజై సెంట్రల్ జైలులో ఒక కరెంటు వైరును నోటితో గట్టిగా పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

09/18/2016 - 18:12

న్యూఢిల్లి:ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీరజవాన్లకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు భారత్ బెదిరిపోదని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నవారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు.

09/18/2016 - 18:11

న్యూఢిల్లి:యూరీ సెక్టార్‌లో సైనిక స్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి ఎన్నో ఆధారాలు లభిస్తున్నాయి. ఆ దాడిలో ఉగ్రవాదులు మోసుకొచ్చిన, ఉపయోగించిన మారణాయుధాలపై పాకిస్తాన్ ముద్రలు కన్పించాయి. ఈ విషయాన్ని సైనిక బలగాలు గుర్తించాయి.

Pages