జాతీయ వార్తలు

అస్సాంలో హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, సెప్టెంబర్ 19: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో గల ప్రాంతాల నుంచి సోమవారం ప్రజలను ఖాళీ చేయిస్తుండగా తలెత్తిన హింస, తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసు సిబ్బంది సహా మరో 19 మంది గాయపడ్డారు. నాగౌన్ జిల్లా కలియబోర్ సబ్ డివిజన్ పరిధిలోని బందేర్‌దుబి ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయాలని పోలీసులు కోరగా, తమకు నష్టపరిహారం చెల్లించిన తరువాతనే ఖాళీ చేస్తామని ప్రజలు తిరగబడ్డారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రజలను ఖాళీ చేయించడానికి తమ బలగాలు వెళ్లగా, ఆందోళనకారులు తమ బలగాలపైకి రాళ్లు రువ్వారని అస్సాం పోలీసు డైరెక్టర్ జనరల్ ముకేశ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ప్రజలు ఖాళీ చేయడానికి తిరస్కరించి, ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆ తరువాత పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. ఈ హింసలో 15మంది పోలీసు సిబ్బంది సహా మొత్తం 19మంది గాయపడ్డారని డిజిపి వివరించారు. ప్రజలను కొంతమంది రెచ్చగొట్టారని, ఈ విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని, ప్రజలను రెచ్చగొట్టి హింసకు కారకులయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి చెప్పారు. ఈ సంఘటన అనంతరం అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
chitram...
అస్సాంలోని నాగౌన్ జిల్లాలో ఆందోళనకారులను తరిమికొడుతున్న భద్రతా దళాలు