జాతీయ వార్తలు

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యూరిలోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్‌కు అండగా నిలిచాయి. దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ డిమాండ్ చేశారు. ఫ్రాన్స్, కెనడా, వెనిజులా తదితర దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని ప్రకటించాయి. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు జరిపినట్లుగా భావిస్తున్న ఈ దాడిని ఖండిస్తూ ప్రపంచం నలుమూలలనుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఒక ప్రకటనలో బాన్ కి-మూన్ పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పడానికి ఈ సమస్యతో సంబంధం ఉన్న అందరు కూడా తమ వంతు బాధ్యతలను నెరవేర్చాలని ఆయన కోరారు. జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న జరిగిన ఉగ్రవదా దాడిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండిస్తోందని ఈ దాడిలో మృతి చెందిన వీర జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని ఫ్రాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఫ్రాన్స్ భారత్ పక్షాన బలంగా నిలబడుతుందని, తమ భూభాగంపై కార్యకలాపాలు నిర్వహిస్తున్న లేదా ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాలను ఉపయోగించుకుంటున్న ఉగ్రవాద సంస్థలపై ప్రతి దేశం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. కాశ్మీర్ ప్రాంతంలో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుని అక్కడ ప్రశాంతత నెలకొల్పడం ఎంతో ముఖ్యమని తమ దేశం భావిస్తోందని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ఆ ప్రకటన పేర్కొంది. యూరిలోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిని మన దేశంలో కెనడా తాత్కాలిక హైకమిషనర్ జెస్ డట్టన్ తీవ్రంగా ఖండిస్తూ మృతులకు, వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. దాడులు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఉగ్రవాదంపై పోరులోభారత్‌కు మద్దతుగా నిలుస్తామని అన్నారు. అలీనోద్యమం (నామ్) అధ్యక్షుడుగా ఉన్న వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాడురో కూడా భారత ప్రభుత్వానికి సంతాప సందేశాన్ని పంపించారు. అమెరికా, బ్రిటన్ ఆదివారమే ఈ దాడిని ఖండించిన విషయం తెలిసిందే.