జాతీయ వార్తలు

నూతన పెన్షన్ విధానంపై పార్టీలన్నీ స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 19: నూతన పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునర్ధురించాలని డిమాండ్ చేస్తూ ఏపి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ నేతలు ఇంద్రశేఖర్ మిశ్రా, అమర్‌జిత్ కౌర్,రజాక్, తెలంగాణ ఎస్‌టియు నేతలు సదానంద గౌడ్, పర్వతరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. 2004 సంవత్సరం నుండి నియమించిన ఉద్యోగులు,వారి కుటుంబాల సామాజిక భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న నూతన పెన్షన్ విధానంపై దేశంలోని రాజకీయ పక్షాలన్నీ తమ స్పష్టమైన వైఖరిని బహిర్గతం చేయాలని ఎస్‌టియు ఏపి రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి,ప్రధాన కార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు డిమాండ్ చేశారు.