జాతీయ వార్తలు

దేనికైనా సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: యూరి మిలిటెంట్ దాడి నేపథ్యంలో భారత్ నుంచి ఎలాంటి సవాళ్లు తలెత్తినా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సన్నద్ధమవుతోంది. భారత నాయకత్వం తీవ్రస్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించడంతో పాక్ ఆర్మీ చీఫ్ సోమవారం సైనిక కమాండర్లతో సమావేశమయ్యారు. దేశీయ, బాహ్య భద్రతా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిణామాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని వారికి స్పష్టం చేశారు. యూరి దాడి అనంతరం తలెత్తుతున్న పరిణామాలను గమనిస్తున్నామని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ కమాండర్ల సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ పాకిస్తాన్ సైనికులు సంసిద్ధంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఎన్నో రకాల సవాళ్లను పాకిస్తాన్ ప్రజలు, సైనిక దళాలు బలంగా ఎదుర్కొని అధిగమించగలిగాయని, భవిష్యత్‌లో దేశ సమైక్యత, సమగ్రతలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా అదే స్ఫూర్తితో, ధైర్య సాహసాలతో ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు.