జాతీయ వార్తలు

రోజుకు 3వేల క్యూసెక్కుల నీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తమిళనాడుకు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకూ రోజుకు మూడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశి శేఖర్ కర్నాటకను ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ సారథ్యంలోని కావేరీ పర్యవేక్షక కమిటీ సోమవారం ఈ మేరకు స్పష్టం చేసింది. ఈ నెల 12న సమావేశమైన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కావేరీ నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల్లో నీటి వినియోగం, వర్షాల వివరాలు సేకరించిన కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిశేఖర్ తమిళనాడుకు రోజులు 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్నాటకను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 30 వరకూ కావేరి జలాలు విడుదల చేయాలన్నారు.

మోదీ పాక్ పర్యటన అనుమానమే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఒకటిన్నర దశాబ్ద కాలంలో అతిపెద్దదైన యూరి సెక్టార్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. దీంతో నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ దేశాల సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కావటం అనుమానంగా మారింది. యూరి దాడికి సంబంధించి పాకిస్తానే కారణమని భారత్ అంతర్జాతీయ సమాజానికి పదే పదే చెప్తోంది. భారత్‌పై పాకిస్తాన్ అఘాయిత్యాలను మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రత్యక్షంగా సహకరించటంపై తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా మోదీ వెల్లడించారు.