జాతీయ వార్తలు

పార్టీ ఫిరాయింపుల కేసు వచ్చేనెల 19కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనేలా స్పీకర్‌కి అదేశాలు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టులో ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్ కురియన్,జస్టిస్ పాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు పార్టీ ఫిరాయింపులపై వేరువేరుగా దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 19కి వాయిదా వేసింది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావులు సుప్రీంకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణలో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, స్పీకర్‌కు ఇప్పటికే నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే.