S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/22/2016 - 21:26

సల్మాన్‌ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించిన జరీన్‌ఖాన్, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత పలు చిత్రాల్లో ఐటెం గాళ్‌గా కూడా చేసిన ఈ భామ, తాజాగా ఓ క్రేజీ అవకాశాన్ని కాదంది. ఆ వివరాల్లోకి వెళితే, జరీన్‌ను తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ఆమెకు కోటి రూపాయల ఆఫర్‌ను ఇచ్చారట.

05/21/2016 - 22:37

నిర్వహించనున్న 17వ ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్ సిద్ధపడుతోంది. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో సల్మాన్‌ఖాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటీనటులు సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, టైగర్‌ష్రాఫ్, ప్రియాంకచోప్రా, దీపికపదుకొనె, సోనాక్షిసిన్హాసహా పలువురు తారలు పాల్గొననున్నారు.

05/21/2016 - 22:29

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఇది ఎన్టీఆర్ నటించే 26వ చిత్రం. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 27వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై వుంటుందని తెలిసింది.

05/21/2016 - 22:22

‘ముకుంద’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన వరుణ్‌తేజ్, ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవలే వచ్చిన ‘కంచె’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన వరుణ్‌తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు.

05/21/2016 - 22:18

జనతా గ్యారేజ్‌లో మోహన్‌లాల్ ఫస్ట్‌లుక్. నిన్న ఎన్‌టిఆర్ బైక్ నడుపుతున్న దృశ్యంతో కూడిన చిత్రాన్ని విడుదల చేసిన యూనిట్ శనివారం ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

05/21/2016 - 22:14

యామిని, భావన, రుహిణి, వర్ష ప్రధాన తారాగణంగా సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై అంజన రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

05/21/2016 - 22:13

తెలుగు చలనచిత్ర సీమలో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతినెలా పదివేల రూపాయలు పింఛన్‌గా ఇవ్వడానికి సిద్ధమైంది. ఆమె పడుతున్న ఇబ్బందులు, అనారోగ్యంపై వార్తలు వచ్చిన నేపథ్యంలో అవి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి వెళ్లాయి. ఈ సందర్భంగా ఆమెను తన కార్యాలయానికి పిలిపించి పరామర్శించారు.

05/21/2016 - 22:03

బ్రహ్మాజీ, సత్యం రాజేష్ ప్రధాన తారాగణంగా అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై బాలా దర్శకత్వంలో నిడమలూరి శ్రీనివాసులు రూపొందిస్తున్న చిత్రం ‘వసుధైక 1957’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తొలి కాపీ సిద్ధమైందని, ఈనెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు.

05/21/2016 - 22:00

మహేష్‌బాబు కథానాయకుడుగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇంత పెద్ద స్టార్‌కాస్ట్‌తో అత్యద్భుతంగా సినిమాను రూపొందించారని హీరో కృష్ణ తెలిపారు. మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత ప్రధాన తారాగణంగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి రూపొందించిన ‘బ్రహ్మోత్సవం’ విడుదలైన సంగతి తెలిసిందే.

05/20/2016 - 21:24

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకు కలెక్షన్లపరంగా కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. ఇప్పటికే వీరిమధ్య కధాచర్చలు కూడా జరిగాయని తెలిసింది.

Pages