S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 22:51

సంచలన తారగా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ నయనతార
ఇప్పుడు సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. వరుస అవకాశాలతో జోరుమీదున్న ఈ భామ మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మాయ చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టిన ఈ భామ ఈసారి కాశ్మోరారాణిగా భయపెట్టడానికి రెడీ అవుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ‘కాష్మోరా’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. హర్రర్ ఎంటర్‌టైనర్‌గా

01/18/2016 - 22:48

స్టార్ హీరోలు కూడా తమ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కోసారి ఎటువంటి పాత్రలకైనా సిద్ధం కాక తప్పదు. ఈ విషయంలో జగపతిబాబు ముందున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరోగా కూడా విలన్‌గా నటించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి విలన్‌గా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హీరోగా మమ్ముట్టి వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

01/18/2016 - 22:46

సంక్రాంతికి ‘డిక్టేటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే 99 చిత్రాల్లో నటించిన ఆయన తన 100వ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికి బాలయ్య 100వ సినిమాపై క్లారిటీ వచ్చేసింది?

01/18/2016 - 22:43

రెండేళ్లుగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న భారీ స్థాయిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

01/18/2016 - 22:34

ప్రముఖ నటుడు నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ ముఖ్యపాత్రల్లో కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది.

01/18/2016 - 02:56

తెలుగుభామ అంజలి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదుంది. ఈ అచ్చతెలుగమ్మాయి సంక్రాంతి పండుగ జరుపుకోకుండా ఎలా వుంటుంది? అందుకే, పండగ రోజున ‘పెరంబు’ అనే తమిళ చిత్రం షూటింగ్‌లో వున్నా, అక్కడే ఆ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆమె సంతోషంగా సంక్రాంతి జరుపుకుంది. తను స్వయంగా పొంగలి తయారుచేసి వాళ్లకి రుచి చూపించింది.

01/18/2016 - 02:54

సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా తమ జీవిత కథలు పుస్తకాలుగా రావాలని కోరుకునేవారు ఉంటారు. కొందరైతే తన జీవిత కథను తానే రాసుకుంటారు కూడా. చిత్ర పరిశ్రమకి సంబంధించి కొంతమంది కథానాయకులు.. నాయికల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో వచ్చాయి. మరికొంతమంది ఆత్మకథను రాసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. అలాంటి నాయికల జాబితాలో కంగనారనౌత్ కూడా చేరబోతోంది.

01/18/2016 - 02:51

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి రూపొందించిన చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది.

01/18/2016 - 01:14

జాతీయ నటుడు కమల్ తన డ్రీమ్ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడంకోసం రంగంలోకి దిగుతున్నాడు. గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన ‘మరుదనాయగం’ సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు. దాదాపు 18 సంవత్సరాల క్రితం కమల్ ‘మరుదనాయగం’ అనే చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కథ.. కథనాలు రెడీ చేసుకుని, తనే టైటిల్ రోల్‌ను పోషిస్తూ దర్శకత్వం వహించాడు.

01/18/2016 - 00:49

ధన్‌రాజ్, దీక్షాపంత్, వౌనిక ప్రధాన తారాగణంగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో శ్రీమతి కళ్యాణిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విడుదల చేశారు.

Pages