చందమామ రావే లోగో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై యూత్ హార్ట్‌ని దోచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి ‘చందమామ రావే’ అని టైటిల్ ఖరారు చేశారు. ‘అది రాదు.. వీడు మారడు’ అనే చక్కటి క్యాప్షన్‌ని ఇటీవలే ఎనౌన్సు చేశారు. టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే క్యాప్షన్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రావటంతో చిత్ర యూనిట్ ఆనందంగా వున్నారు. సినీపెద్దలు సైతం ఫోన్లు చేసి టైటిల్, క్యాప్షన్ చాలా క్యాచిగా వున్నాయని, చాలా పాజిటివ్‌గా వుందనడం యూనిట్ సభ్యుల్లో మంచి ఎనర్జి నింపిందని, అదే ఎనర్జీతో ‘చందమామరావే’ చిత్ర లోగోను పౌర్ణమి సందర్భంగా విడుదల చేశామన్నారు. ఈ చిత్రాన్ని ఐఇఎఫ్ కార్పొరేషన్ - ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పొరేషన్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మాతలు కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ట్విన్స్ ‘్ధరమ్-రక్ష’ అనేవారు సంయుక్తంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారని, ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్‌గా చేస్తోందని, చక్కటి ప్రేమకథకి గ్రాండియర్ విజువల్స్ తోడైతే ఆ చిత్రం ప్రేక్షకులను కనువిందు చేస్తుందని అన్నారు.