S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/25/2016 - 22:48

‘్భలే భలే భలే మగాడివోయ్’ హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఫస్ట్‌లుక్‌కి అంతటా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

05/25/2016 - 22:47

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం ‘అ ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం చేశామని అన్నారు.

05/25/2016 - 22:42

అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హాట్ భామ భూమిక టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకుంది. పలు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా చేసి తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె ఆ తరువాత భరత్‌ఠాకూర్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ భూమిక రీ ఎంట్రీకి రెడీ అయిందని తెలిసింది. ఓ కన్నడ సినిమాతో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా అంటూ చెప్పింది.

05/25/2016 - 22:40

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్ చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05/25/2016 - 22:38

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న ‘ధ్రువ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తరువాత చరణ్ తదుపరి సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. చరణ్ తరువాతి సినిమా సుకుమార్‌తో ఉంటుందన్న విషయం తెలిసిందే.

05/25/2016 - 22:35

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న జెనీలియా.. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈమె ఇప్పుడు మరో అవతారం ఎత్తింది. ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్‌లో హీరోగా, నిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రితేష్‌కి జెన్ని పి.ఆర్ అవతారం ఎత్తింది.

05/25/2016 - 22:21

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై ఆది కథానాయకుడిగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/25/2016 - 22:18

బ్రహ్మాజీ, సత్యం రాజేష్, పావని, బేబీ యోధ, కారుణ్య ప్రధాన తారాగణంగా అరుణశ్రీ కంబైన్స్ బ్యానర్‌పై బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వసుధైక’. నిడమలూరి శ్రీనివాసులు నిర్మాత. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు బాల మాట్లాడుతూ- ‘ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చారు.

05/25/2016 - 22:16

దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు. బిగ్ బి అమితాబ్‌బచ్చన్, తనయుడు అభిషేక్‌బచ్చన్, కోడలు
ఐశ్వర్యతో కలసి పాల్గొనగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్‌కపూర్, శ్రద్ధాకపూర్, జాకీష్రాఫ్‌సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈమధ్యే కేన్స్‌లో రెడ్‌కార్పెట్‌పై సందడి చేసిన ఐశ్వర్య ప్రఖ్యాత డిజైనర్ నరుూం రూపొందించిన నల్లని దుస్తుల్లో మిలమిల మెరిస్తే,

05/25/2016 - 22:10

నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా యశస్విని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందించిన చిత్రం ‘దండు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి తొలికాపీని సిద్ధం చేశారు.

Pages