వసుధైక ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మాజీ, సత్యం రాజేష్, పావని, బేబీ యోధ, కారుణ్య ప్రధాన తారాగణంగా అరుణశ్రీ కంబైన్స్ బ్యానర్‌పై బాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వసుధైక’. నిడమలూరి శ్రీనివాసులు నిర్మాత. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు బాల మాట్లాడుతూ- ‘ఈ సినిమా కథ చెప్పగానే నిర్మాత సినిమా చేయడానికి ముందుకొచ్చారు. 1957 లో జరిగిన ఓ సంఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోతుంది. అలా చనిపోయిన ఆ పాప మరోసారి పుడుతుంది. తను మరలా పుట్టడానికి గల కారణాలేంటనేదే ఈ కథ ఇతివృత్తం. హారర్, సెంటిమెంట్, కామెడీ అంశాలతో నడిచే కథ. మే 27న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ, కథ నచ్చి సినిమా చేయడానికి సిద్ధమయ్యానని, అందరి సహకారంతో ఈ సినిమా పూర్తయిందని, దీని తరువాత మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్ దేశపతి మాట్లాడుతూ, ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలుంటాయని, సాహిత్య విలువలతో కూడిన చక్కటి పాటలను కంపోజ్ చేసే అవకాశం వచ్చిందని, తల్లీ కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఎలివేట్ చేసే విధంగా ఒక పాట ఉంటుంది అని చెప్పారన్నారు. శ్రీలత మాట్లాడుతూ, ఇది నా మొదటి సినిమా అని, తల్లి పాత్రలో నటించానని, నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని చెప్పారు.