చల్ చల్ గుర్రం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందించిన చిత్రం ‘చల్ చల్ గుర్రం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ- కథలో ప్రధాన అంశం నచ్చి ఈ చిత్రాన్ని చేయడానికి నిర్మాత ముందుకు వచ్చాడని, కథనంలో వున్న నవ్యత అందరికీ నచ్చుతుందని తెలిపారు. సినిమాలోని వెంగీ పాటలు, కెమెరా పనితనం హైలెట్‌గా వుంటాయని కథానాయకుడు శైలేష్ తెలిపారు. ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో చల్ చల్ గుర్రం అందరికీ నచ్చుతుందనే ఆశాభావంతో ఈ సినిమా రూపొందించామని, సినిమాలో పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటాయని, 34 పాత్రలు వున్నా ఏ పాత్ర మరో పాత్రతో అనుబంధం కలిగి వుండకపోవడం ఈ కథలో విశేషమని అన్నారు. యూనిక్ కానె్సప్ట్‌తో మనుషులమధ్య వస్తు సంబంధం కాకుండా సంస్కారబంధం వుండాలన్న కోణం లో పూర్తిగా కార్పొరేట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రూపొందించిన ఈ సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని ఆయన అన్నారు. నాగబాబు, బెనర్జీ, అశోక్‌కుమార్, చిట్టిబాబు, ముక్తార్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, సుడిగాలి సుధీర్, అంబటి శ్రీని, హర్ష, జోగినాయుడు, కృష్ణంరాజు, తిరుపతి ప్రకాష్, దువ్వాసి మోహన్, జూ.రేలంగి, మీనా, శిల్పా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వి.శ్యాంప్రసాద్, సంగీతం:వెంగీ, ఎడిటింగ్:శంకర్, నిర్మాత:ఎం.రాఘవయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మోహన ప్రసాద్.