S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/24/2016 - 21:23

సుప్రీమ్ చిత్రంతో మరో హిట్ కొట్టిన రాశిఖన్నా కెరీర్ జోరుమీదుంది. ఈ చిత్రం విజయంతో నటిగా, గ్లామర్ డాల్‌గా మరింత లైమ్‌లైట్‌లోకొచ్చింది. బెల్లం శ్రీదేవిగా ఆమె నటనకు మార్కులు పడుతున్నాయి. అయితే ఇటీవల ఆమెపై పలు కామెంట్స్ వస్తున్న విషయంపై నోరు మెదపడం లేదు రాశిఖన్నా.

05/22/2016 - 21:43

చిన్నితెరపై సంచలనం సృష్టించిన ‘బాలికావధు’ (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌లో నటించి దేశమంతటా ప్రేక్షకుల మనసుదోచిన నటి అవికాగోర్ తెలుగుప్రేక్షకులకూ పరిచితమే. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్రాన్స్‌లోని కేన్స్ నదీతీరంలో జరుగుతున్న చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. మూడురోజులుగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది.

05/22/2016 - 21:41

ఆనంద్ నందా, రేష్మి జంటగా వి సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ- ఈ సినిమా కోసం అనేక పేర్లను పరిశీలించి చివరికి ఈ పేరైతేనే కథనానికి సరిపోతుందని తెలిపారు.

05/22/2016 - 21:39

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 2న విడుదలకు సిద్ధం చేశారు.

05/22/2016 - 21:38

ధన్‌రాజ్, దీక్షాపంత్ జంటగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణి, రామ్, తేజ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘బంతిపూల జానకి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

05/22/2016 - 21:36

బాలీవుడ్ తార శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాల తనయుడు వియాన్ పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతోను, జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్‌లు తమ రెండేళ్ల తనయుడు రియాన్‌తోను, మాధవన్, సరితాబ్రిజె దంపతులు తమ కుమారుడు వేదాంత్‌తోను కలసి హాజరయ్యారు.

05/22/2016 - 21:33

టిఎస్‌ఆర్ ప్రధాన పాత్రలో ఎస్.ఆర్.కుమార్‌రాజా దర్శకత్వంలో పార్వతమ్మ రూపొందించిన చిత్రం ‘క్రీస్తు యేసు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశారు.

05/22/2016 - 21:31

వసంత్ మూవీ క్రియేషన్స్ పతాకంపై దాసరి గంగాధర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘అంతంలేని కథ’ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. లేడీ ఓరియంటెడ్ కథాకథనాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ ప్రధాన పాత్రలో నటించనున్నదని సమాచారం. ఈ సందర్భంగా దాసరి గంగాధర్ మాట్లాడుతూ, సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథ సరికొత్తగా ఉంటుందని తెలిపారు.

05/22/2016 - 21:29

అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాష్, మానసాజోషి, రాజేష్ ప్రధాన తారాగణంగా శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.డి.అరవింద్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అడవిలో లాస్ట్‌బస్’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను సినిమా సమర్పకురాలు పూజశ్రీ తెలుపుతూ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందిందని, గత సంక్రాంతికి కన్నడంలో విడుదలై ఘన విజయం సాధించిందని తెలిపారు.

05/22/2016 - 21:28

‘అలా ఎలా’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన హెబా పటేల్‌కు సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ సినిమాలో బోల్డు పాత్రలో నటించిన ఆకట్టుకున్న హెబాకు ఆ తరువాత అవకాశాలు క్యూకట్టాయి. తాజాగా రాజ్‌తరుణ్ సరసన నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న హెబాకు ఇటీవలే మెగా కాంపౌండ్‌లో ఛాన్స్ దక్కింది.

Pages