S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/27/2016 - 21:23

సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ మళ్ళీ రామ్‌గోపాల్ వర్మతో కలసి ఓ చిత్రం చేయనున్నారు. సర్కార్, సర్కార్‌రాజ్ చిత్రాలకు సీక్వెల్‌గా ‘సర్కార్-3’ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 1ళ3శ2 ప్రమోషనల్ కార్యక్రమం సందర్భంగా అమితాబ్‌బచ్చన్ మాట్లాడుతూ..

05/27/2016 - 21:21

‘వెనె్నల’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశంచేసిన కిశోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తరువాత ఎన్నో సినిమాలలో కిశోర్ తన పాత్రల ద్వారా ప్రేక్షకులను నవ్వించాడు. ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వెనె్నల కిశోర్‌కి చిక్కింది. అదేమిటంటే- మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం అయిన ‘కత్తిలాంటోడు’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.

05/27/2016 - 21:18

దర్శకుడు కరుణాకరన్ పేరు వినగానే గుర్తొచ్చేవి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీస్. పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో మర్చిపోలేని ‘తొలిప్రేమ’ వంటి హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు, ‘డార్లింగ్’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి మంచి ప్రేమకథలను సినిమాలుగా రూపొందించాడు. ప్రస్తుతం కరుణాకరన్ హీరో రామ్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా వచ్చింది.

05/27/2016 - 21:16

సంతోష్‌రాజ్, నేహాదేశ్‌పాండే జంటగా రమేష్ ముక్కెర దర్శకత్వంలో కౌండిన్య మూవీస్ పతాకంపై టి.దామోదర్‌గౌడ్ రూపొందిస్తున్న ‘ఆనువంశికత’ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశం శుక్రవారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి క్లాప్‌నివ్వగా అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం ఎం.పి.

05/27/2016 - 21:14

విడుదలైన అన్ని కేంద్రాలలో ‘బిచ్చగాడు’ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్‌కు ప్రేక్షకులనుండి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది అని నిర్మాత చదలవాడ తిరుపతిరావు తెలిపారు. విజయ్ ఆంటోని, సత్నాటైటస్ జంటగా తమిళంలో రూపొందించిన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

05/27/2016 - 21:13

తాజాగా విడుదలైన ‘సరబ్‌జిత్’ చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరిగా ఆమె నటించారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ప్రఖ్యాత డిజైనర్ సబ్యసాచి రూపొందించిన దుస్తుల్లో ప్రత్యక్షమైన ఐశ్వర్య ఆహూతులను ఆకట్టుకుంది.

05/27/2016 - 21:10

శ్రీ కంచెమ్మ తల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా ఎం.శ్రీనివాసరావు దర్శకత్వంలో పైలా దేవదాస్‌రెడ్డి రూపొందించిన ‘రెండక్షరాలు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ మొదటివారంలో విడుదలకు సిద్ధమైంది.

05/27/2016 - 21:08

‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా తెలుగు ప్రేయకులకు పరిచయమైన రాశిఖన్నా ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ‘బెంగాల్ టైగర్’ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ బ్యూటీ ఇటీవలే సాయిధరమ్‌తేజ్ సరసన నటించిన ‘సుప్రీమ్’ ద్వారా మంచి హిట్ అందుకుంది.

05/26/2016 - 21:13

విజయ్‌భరత్, అశ్విని జంటగా ఎస్.ఎస్. సెల్యూలాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన వినోదం 100శాతం అన్నీ నవ్వులతోనే నిండి వుందని దర్శకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఈరోజు చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుతం పరిశ్రమలో చిన్న సినిమాలను థియేటర్ వద్దకు తీసికెళ్లి ప్రోత్సహించాలన్న నిర్ణయంతో తాను ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు.

05/26/2016 - 21:12

తెలుగులో హీరోయిన్‌గా పరిచయమై రెండు, మూడు చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఇక్కడ అనుకున్న క్రేజ్ దక్కలేదు. దాంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో తెలుగమ్మాయిలకు మంచి క్రేజ్ వున్న దృష్ట్యా ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటోంది. తాజాగా శ్రీదివ్య నటిస్తున్న చిత్రం ‘రాయుడు’.

Pages