S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 21:22

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో గోపాలకృష్ణ దర్శకత్వంలో గుణపాటి సురేష్‌రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వేళ్ల వౌనికా చంద్రశేఖర్, ఉమాలక్ష్మీనరసింహ నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు విష్ణు క్లాప్‌నివ్వగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

05/20/2016 - 21:20

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందించిన శ్రీశ్రీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు ముప్పలనేని శివ వివరిస్తూ, ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, సినిమాలో మహేష్‌బాబు వాయిస్‌ఓవర్ హైలెట్‌గా నిలువనుందని తెలిపారు.

05/20/2016 - 21:18

నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అ ఆ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే పాటలని విడుదల చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

05/20/2016 - 21:15

సుశాంత్ కథానాయకుడి శ్రీ నాగ్, శ్రీ జి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- తండ్రీ కొడుకుల కథనం ప్రధానంగా సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

05/20/2016 - 21:11

కేవలం సినిమా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ‘కేన్స్’ చిత్రోత్సవంలో నిర్వహించే ఛారిటీ షోలోనూ పలువురు తారలు పాలుపంచుకున్నారు. ఎయిడ్స్ నివారణ, పరిశోధనలు, ప్రచార కార్యక్రమాలకు కావలసిన నిధులు సమకూర్చేందుకు ఏటా కేన్స్‌లో ‘ఎఎంఎఫ్ ఎఆర్’ (అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్) గాలా పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తారు.

05/20/2016 - 21:01

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అయాన్, కాంచన ప్రధాన తారాగణంగా ప్రసాద్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఇట్లు మీ సరోజ’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/20/2016 - 20:59

యాంకర్‌గా తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీని తెచ్చుకున్న అనసూయకు ‘జబర్దస్త్’ ప్రోగ్రాం స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దాంతో మరోవైపు సినిమాల్లో కూడా అవకాశాలు క్యూకట్టాయి. నాగార్జునతో నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘క్షణం’ సినిమాలతో అనసూయ మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల తరువాత ఈమెకు మరిన్ని సినిమాలు వస్తాయని అనుకున్నారందరూ. కానీ, ఇప్పటివరకూ అనసూయ ఏ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

05/20/2016 - 20:57

ఉమ, రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ ముఖ్యపాత్రల్లో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో జైచిరంజీవ ఆర్ట్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ఫ్లాట్‌ఫాం టీనేజ్’.

05/20/2016 - 20:53

‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామర్ భామ కాథరీన్‌కు ఆ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా కూడా తెలుగులో ఆశించిన గుర్తింపు దక్కలేదు. తాజాగా ‘సరైనోడు’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడు మెగా ఛాన్స్ దక్కింది. చిరంజీవి హీరోగా నటించే 150వ సినిమాలో ఓ హీరోయిన్‌గా ఎంపికైందని తెలిసింది.

05/19/2016 - 21:09

రజనీకాంత్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా వి క్రియేషన్స్ పతాకంపై పా.రంజిత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.్థను రూపొందిస్తున్న ‘కబాలి’ చిత్రం జూలై మొదటివారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

Pages