S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/26/2016 - 21:10

శ్రీ మంజునాధ మూవీ మేకర్స్ పతాకంపై తెలుగులో విడుదలవుతున్న చిత్రం ‘అడవిలో లాస్ట్‌బస్’. అవినాష్, నర్సింహరాజు, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా ఎస్.డి.అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ కన్నడ చిత్రం విడుదలై అఖండ విజయంసాధించిన నేపథ్యంలో తెలుగులో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05/26/2016 - 21:09

ఆనంద్, రాజ్‌బాల, రాధిక ప్రధాన తారాగణంగా విజయశేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 టు 4’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఓ ఐదుగురు స్నేహితులమధ్య రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఒక రాత్రిలో జరిగిన ఆసక్తికర కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు.

05/26/2016 - 21:08

జూనియర్ ఎన్టీఆర్ నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావుకు నివాళులు అర్పించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఘాట్‌ను దర్శించుకునే ఆయన ఈ రోజే నివాళులు అర్పించడం చర్చనీయాంశమైంది. అయితే, 28న చెన్నైలో ఎన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’ షూటింగ్‌లో పాల్గొనవలసి వున్నందున ఇవాళ ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించి అటునుంచి అటే చెన్నై వెళ్ళారు.

05/26/2016 - 21:06

చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవ, కోటయ్య, రమణారెడ్డి రూపొందించిన చిత్రం ‘మయసభ’. ఈ చిత్రం ముగింపు కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఖమ్మం, మైలవరం, హైదరాబాద్ ప్రాంతాలలో షూటింగ్ చేశామని, నాలుగు పాటలతో రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని అన్నారు.

05/26/2016 - 21:06

శ్రీ నందన్ మూవీస్ పతాకంపై చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి జంటగా పల్లెల వీరారెడ్డి (చెగువేరా) దర్శకత్వంలో మహేష్ కల్లె రూపొందిస్తున్న చిత్రం ‘హ్యాపీబర్త్‌డే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/26/2016 - 21:05

నాగశౌర్య, నిహారిక కొణిదల జంటగా మధురా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీ్ధర్‌రెడ్డి రూపొందించిన ‘ఒక మనసు’ జూన్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఆడియోకు, ఫస్ట్‌లుక్‌కు, థియేటర్ ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేశారు.

05/26/2016 - 21:03

ధనుష్, శ్రీయ, జెనీలియా ప్రధాన తారాగణంగా సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై జోహార్ దర్శకత్వంలో ఉమ రూపొందించిన చిత్రం ‘నారదుడు’. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ధనుష్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా అనువాదం చేసి విడుదల చేస్తున్నామని తెలిపారు.

05/26/2016 - 21:01

‘పటాస్’ సినిమాతో కమర్షియల్ హీరోగా విజయాన్ని అందుకున్న కల్యాణ్‌రామ్ ఈసారి పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటివరకూ తన కెరీర్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌తో పనిచేయని కల్యాణ్‌రామ్, ఈసినిమా కోసం అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

05/26/2016 - 20:59

జగదీష్, లిపి జంటగా జె.కె.జి. దర్శకత్వంలో లిపి భార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.కృష్ణమోహన్, గుండు ఆంజనేయులు నిర్మిస్తున్న చిత్రం ‘అటు ఇటు కాని హృదయంతోటి’.

05/26/2016 - 20:56

గోవా భామ ఇలియానా ఆమధ్య బాగా సన్నబడింది. అదేదో జీరో సైజ్ కోసమేనట. అసలే సన్నగా నాజూకుగా వుండే ఈ భామ ఇంకా సన్నబడడంతో చూసినవారు పెదవి విరిచారు. టాలీవుడ్‌ను కాదని బాలీవుడ్ చెక్కేసిన ఇలియానా, అక్కడ వెలగబెట్టింది పెద్దగా ఏమీ లేదు. ఈ ఐదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేసింది. అవి కూడా హిట్ కాలేదు. దాంతో తన క్రేజ్ తుస్సుమంది. ఇప్పుడు చేతిలో కేవలం రుస్తుం చిత్రం మాత్రమే వుంది.

Pages