థ్రిల్లర్ నేపథ్యంలో 7 టు 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్, రాజ్‌బాల, రాధిక ప్రధాన తారాగణంగా విజయశేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘7 టు 4’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఓ ఐదుగురు స్నేహితులమధ్య రాత్రి 7 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఒక రాత్రిలో జరిగిన ఆసక్తికర కథనంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. థ్రిల్లింగ్ నేరేషన్‌తో సాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో విడుదల తరువాత మంచి రెస్పాన్స్ లభించిందని, థ్రిల్లింగ్ కథనంతోపాటుగా సోషల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో వుందని ఆయన అన్నారు. ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ కథాంశాలకు మంచి క్రేజ్ వున్న నేపథ్యంలో ఈ సినిమా తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. లౌక్య, పప్పుశ్రీనివాస్, శ్రీకాంత్, ప్రవీణ్, భరత్, కిరణ్, నితేష్, కార్తీక్, అనూష్, దివ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు:ద్విభాష్యం శ్రీలక్ష్మీవందన, సంగీతం:స్నేహలత మురళి, కెమెరా:ఇ.కె.ప్రభాత్, చిరంజీవి, ఎడిటింగ్:సత్య గిడుతూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాణం, దర్శకత్వం:విజయ్‌శేఖర్ సంక్రాంతి.