అటు ఇటు కాని హృదయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదీష్, లిపి జంటగా జె.కె.జి. దర్శకత్వంలో లిపి భార్గవ ప్రొడక్షన్స్, విమన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.కృష్ణమోహన్, గుండు ఆంజనేయులు నిర్మిస్తున్న చిత్రం ‘అటు ఇటు కాని హృదయంతోటి’. రెండో షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత డి.వి.కృష్ణమోహన్ వివరాలు తెలియజేస్తూ, ‘షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది, కథ బాగా నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చాం, దర్శకుడి ప్రతిభ చూశాక సినిమాపై మాకు మరింత నమ్మకం పెరిగింది..’ అన్నారు. దర్శకుడు జెకెజి మాట్లాడుతూ, మే 15 నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి, జూన్ అంతానికి మిగతా కార్యక్రమాలను పూర్తిచేస్తామన్నారు. ఈ చిత్రానికి పాటలు:జె.కె.జి., సంగీతం:జి.ప్రవీణ్, ఎడిటింగ్:జి.ఎస్.చౌదరి, కెమెరా:సునీల్, నిర్మాతలు:కృష్ణమోహన్, గుండు ఆంజనేయులు, దర్శకత్వం.జె.కె.జి.