3న రానున్న లాస్ట్‌బస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మంజునాధ మూవీ మేకర్స్ పతాకంపై తెలుగులో విడుదలవుతున్న చిత్రం ‘అడవిలో లాస్ట్‌బస్’. అవినాష్, నర్సింహరాజు, మేఘశ్రీ ప్రధాన తారాగణంగా ఎస్.డి.అరవింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ కన్నడ చిత్రం విడుదలై అఖండ విజయంసాధించిన నేపథ్యంలో తెలుగులో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకురాలు పూజశ్రీ మాట్లాడుతూ, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకాదరణ మెండుగా వున్న ఈ నేపథ్యంలో కానె్సప్టు సరికొత్తగా సాగే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, లంబసింగినుండి అరకు వెళ్ళే ఆఖరి బస్సులో ఏం జరిగింది అనే అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం రెండు అవార్డులను కూడా ఇచ్చిందని, రెండు పాటలతో రూపొందిన ఈ చిత్రంలో పాటలు, మాటలు హైలెట్‌గా వుంటాయని ఆమె అన్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశామని, వచ్చేనెల 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. ప్రకాష్, మానస జోషి, రాకేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:అనంత అరసు, మాటలు:నందు తుర్లపాటి, పాటలు:రాకేందు వౌళి, సంగీతం, దర్శకత్వం:ఎస్.డి.అరవింద్.