హ్యాపీ బర్త్‌డేకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నందన్ మూవీస్ పతాకంపై చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథి జంటగా పల్లెల వీరారెడ్డి (చెగువేరా) దర్శకత్వంలో మహేష్ కల్లె రూపొందిస్తున్న చిత్రం ‘హ్యాపీబర్త్‌డే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుక నేపథ్యంలో ఒక ఇంట్లో సాగే కథనంతో ఈ చిత్రం రూపొందిందని, సాయంత్రం 7 గంటలనుండి 12 గంటలవరకు, ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది అనే ఆసక్తికర కథతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో 15 నిమిషాల గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు. దర్శకుడు చెప్పిన హారర్ కథాంశం నచ్చడంతో ఈ చిత్రాన్ని వైజాగ్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశామని, కీలకమైన కొన్ని సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించామని, ప్రస్తుతం ఆర్.ఆర్, డిఐ కార్యక్రమాలు జరుపుతున్నామని నిర్మాత మహేష్ కల్లె తెలిపారు. తొలి కాపీ సిద్ధమయ్యాక ఆడియోను విడుదలచేసి జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆయన అన్నారు. సంజన, శ్రవణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం:సంతోష్‌రెడ్డి, ఎడిటింగ్:మహేంద్రనాధ్, నిర్మాత:మహేష్ కల్లె, దర్శకత్వం:పల్లెల వీరారెడ్డి.