కుటుంబ కథనంతో చుట్టాలబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై ఆది కథానాయకుడిగా వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల క్లైమాక్స్ చిత్రీకరణతో షూటింగ్ అంతా పూర్తిచేశామని, నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలుస్తాయని తెలిపారు. సంగీతం దర్శకుడు విదేశాలనుండి రాగానే ఆడియో విడుదల కార్యక్రమాన్ని జరుపుతామని, తనకు ఆదికి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి మంచి పేరు తెస్తుందని చిత్ర దర్శకుడు వీరభద్రమ్ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
నమితా ప్రమోద్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, గిరిధర్, అనితానాధ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మాటలు:్భవానీ ప్రసాద్, నిర్మాతలు:వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రమ్.