నాలుగు భాషల్లో అంపశయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనీ క్రియేషన్స్, ఓమ్ నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై శ్యాంకుమార్, పావని జంటగా ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందించిన చిత్రం క్యాంపస్ అంపశయ్య. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు ప్రభాకర్ జైనీ వివరిస్తూ, 1969లో నవీన్ రాసిన అంపశయ్య నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని, కథలో ఆత్మ, విలువలు వున్నాయని తెలిపారు. మానసిక సంఘర్షణలతో సాగే ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఓ గ్రామం నుండి యూనివర్సిటీకి చదువుకోవటానికి వచ్చిన యువకుని జీవితంలో ఓ రోజు ఉదయం నుండి రాత్రివరకు జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందిందని, 1970 నాటి వాతావరణాన్ని సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించామని ఆయన అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.