వచ్చే నెలలో లవ్ యూ అలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందన్‌కుమార్, సంగీతా చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ పతాకంపై ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘లవ్ యూ అలియా’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ- అందరినీ ఆకట్టుకునే చక్కని ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా రూపొందిందని, భూమిక, సుధీప్, సన్నీలియోన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో నటించారని తెలిపారు. జెస్సీ గిఫ్ట్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రతి పాటా హైలెట్‌గా వుంటుందని, ఈ నెలాఖరుకు ఆడియో విడుదల చేసి జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నికిషా పటేల్, రవిచంద్రన్, రవిశంకర్, షాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సంతోష్‌రాయ్ పతాజే, ఎడిటింగ్:సురేష్.డి.హెచ్., సంగీతం:జెస్సీ గిఫ్ట్, నిర్మాణం:సమీస్ మ్యాజిక్ సినిమా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇంద్రజిత్ లంకేష్.