టీజర్‌లో కొబ్బరిమట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణేష్‌బాబు, గాయత్రి, గీతాంజలి ప్రధాన పాత్రల్లో రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ మరియు అమృత ప్రొడక్షన్స్, సంజనా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో హీరో సాయిధరమ్‌తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద టీజర్‌ను నాతో లాంఛ్ చేయించారని, సంపు అంటే తనకు చాలా ఇష్టమని, జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు అనే బ్రాండ్‌ను సంపాదించుకున్నాడని, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ, సంపూ రియల్ పెర్‌ఫార్మర్ అని, ఏదో ఆకతాయితనంగా తను ఇండస్ట్రీలోకి రాలేదని, తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడని, నిర్మాత తనకున్న పరిధిలో ఆడియన్స్‌కు ఈ సినిమా రీచ్ అయ్యే విధంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నాడు. వారి ప్రయత్నం సక్సెస్ కావాలి అని చెప్పారు.
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ, ‘హృదయకాలేయం’ సినిమా ట్రైలర్‌ను చూసి మారుతి ఆఫీసుకు పిలిపించి మాట్లాడారని, ఆయన నాకు సెంటిమెంట్‌గా మారిపోయారని,కొబ్బరిమట్ట టీజర్‌ను సాయిధరమ్‌తేజ్ లాంఛ్ చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారనే ఫీలింగ్ కలిగిందని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్ మాట్లాడుతూ- పెదరాయుడు గెటప్‌లో సంపూ చెప్పే డైలాగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, రెండు మూడు పేజీలు ఉండే ఆ డైలాగ్ చెప్పడానికి తను చాలా టేక్స్ తీసుకుంటాడని అనుకున్నానని, కానీ అవలీలగా చెప్పేశాడు అని చెప్పారు.
నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ, ‘హృదయకాలేయం’ తర్వాత సంపూతో సినిమా చేయాలనుకున్నానని, ఈ చిత్రం ద్వారా రూపక్ రోనాల్డ్‌సన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నానని, ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని, అంత అద్భుతంగా వచ్చిందని, సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం:కామ్రాన్, స్టంట్స్:స్టంట్ జాషువా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:స్టివెన్ శంకర్, ప్రొడ్యూసర్స్:సాయి రాజేష్ నీలం, ఆది కుంభగిరి, దర్శకత్వం:రూపక్ రోనాల్డ్‌సన్.