10న రానున్న రైట్ రైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీ సత్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఈ పాత్ర భిన్నంగా వుంటుందని, చాలా నేచురల్‌గా వుంటుందని అన్నారు. ఓ లక్ష్యంకోసం తపించే యువకుడి కథనంతో సాగే ఈ చిత్రంలో కథానాయకుడు బస్ కండక్టర్‌గా మారతాడని, అతనికి బస్సులో ఓ అమ్మాయి తారసపడితే, వారిద్దరిమధ్య అనుబంధం ఎలా ఏర్పడింది అనే కథనంతో ఫస్ట్ఫా వినోదప్రధానంగా, సెకెండాఫ్ మిస్టరీగా సాగుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేశామని, ఎస్.కోటనుండి గవిటికి వెళ్ళే ఓ ఆఫీసు బస్సులో ఈ సినిమా సాగుతుందని, కామెడీ లవ్, మిస్టరి అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుందని నిర్మాత జె.వంశీకృష్ణ తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ఆర్డినరి చిత్రాన్ని తెలుగు నేటివిటీకి మార్పులు చేర్పులు చేసి రూపొందించామని, బాహుబలి ప్రభాకర్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, అన్ని వర్గాలవారికి నచ్చుతుందని ఆయన అన్నారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తా.రమేష్, జీవా, రాజా రవీందర్, భరత్‌రెడ్డి, పావని, కరుణ, జయవాణి తదితరులు నటించారు.