మాడ్రిడ్‌లో ఐఫా వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహించనున్న 17వ ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్ సిద్ధపడుతోంది. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హీరో సల్మాన్‌ఖాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటీనటులు సల్మాన్‌ఖాన్, హృతిక్‌రోషన్, టైగర్‌ష్రాఫ్, ప్రియాంకచోప్రా, దీపికపదుకొనె, సోనాక్షిసిన్హాసహా పలువురు తారలు పాల్గొననున్నారు. జూన్ 23నుంచి మూడురోజుల పాటు నిర్వహించే ఈ వేడుకకు ఫర్హాన్ అక్తర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. ఇక బాలీవుడ్ తారలంతా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. బిజీ షెడ్యూల్‌వల్ల కొద్దిసంవత్సరాలుగా ఐఫాకు హాజరవలేకపోతున్న తాను ఈసారి తప్పనిసరిగా వెళతానని సల్మాన్‌ఖాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే అక్కడ జరిగే వేడుకల్లో తాను చేసే నృత్యం హృతిక్, టైగర్‌ష్రాప్‌లకన్నా అద్భుతంగా ఉండకపోవచ్చని సరదాగా వ్యాఖ్యానించాడు. ఐఫా వేడుకకోసం మాడ్రిక్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ ఉత్సవం అంటే తమకెంతో ఇష్టమని టైగర్‌ష్రాఫ్ అన్నాడు. ప్రెసమీట్‌లో పాల్గొన్న బాలీవుడ్ అలనాటి నటుడు అనిల్‌కపూర్ మాట్లాడుతూ ఈసారి వేడుకలకు సల్మాన్‌ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. కాగా ఐఫా వేడుకల్లో తాను ప్రత్యేకంగా యోగా తరగతులు నిర్వహించునున్నానని, ఇది తనకు ఎంతో గర్వకారణమని శిల్పాశెట్టి అన్నారు. కాగా ఇప్పటివరకు మూడుసార్లు ఐరోపా దేశాల్లో జరిగిన ‘ఐఫా‘ వేడుక నాలుగోసారి మాడ్రిడ్ వేడుకగా జరుగుతోందని, ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాష స్పానిష్ అని, అందువల్ల ఇక్కడ జరిగే వేడుక ద్వారా భారతీయ సినిమా ఎక్కువమందికి చేరుతుందని నిర్వాహకులు మాడ్రిడ్‌నుంచి లాంచనపూర్వక ప్రకటన చేశారు. కాగా ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో తారలు ఎల్లియావరమ్, గాయని మొనాలీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల
సమావేశంలో పాల్గొన్న
అనిల్‌కపూర్,
శిల్పాశెట్టి,
సల్మాన్‌ఖాన్

ప్రెస్‌మీట్ అనంతరం జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న
బాలీవుడ్ తారలు శిల్పాశెట్టి,
ఎల్లియారమ్, మొనాలీ ఠాకూర్