తమిళ దర్శకుడితో బన్నీ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకు కలెక్షన్లపరంగా కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. ఇప్పటికే వీరిమధ్య కధాచర్చలు కూడా జరిగాయని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తిచేసిన లింగుస్వామి మరోవైపు ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత నిర్మిస్తాడని, జూన్ 1న ఈ చిత్రం సెట్స్‌పైకి రానుందని తెలిసింది. మరోవైపు అల్లు అర్జున్‌తో సినిమా చేయడానికి మరో క్రేజీ దర్శకుడు విక్రం కుమార్ కూడా సిద్ధమయ్యాడు. త్వరలోనే అల్లు అర్జున్, లింగుస్వామిల చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.