ఆ యాడ్‌లో నటించను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్మాన్‌ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించిన జరీన్‌ఖాన్, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత పలు చిత్రాల్లో ఐటెం గాళ్‌గా కూడా చేసిన ఈ భామ, తాజాగా ఓ క్రేజీ అవకాశాన్ని కాదంది. ఆ వివరాల్లోకి వెళితే, జరీన్‌ను తమ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేయవలసిందిగా కోరుతూ ఆమెకు కోటి రూపాయల ఆఫర్‌ను ఇచ్చారట. అయితే, ఆ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్న ఆమె నో చెప్పిందట. ఇంతకీ ఆ ప్రొడక్ట్ ఏంటంటే, బరువు తగ్గడానికి ఉపయోగించే పిల్స్ అని తెలిసింది. ఇలాంటి వాటివల్ల ఎవరూ బరువు తగ్గరని, అందుకే ఆ ప్రచారానికి తను నో చెప్పానని చెబుతోంది. మొత్తానికి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకుంది. మొత్తానికి జరీన్ ఆదర్శం గొప్పదే.

చిత్రం జరీన్‌ఖాన్