S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

10/11/2019 - 19:55

అవి తెలిసికొనుటకు పూర్వము మరి ఒకటి రెండు విశేషములు తెలియవలసి వున్నది. అవి ఏమంటే పత్రికలలో ప్రకటింపబడిన మొత్తము వ్యాసములు ఏబది. కాగా పుస్తక రూపమున సంతరింపబడినవి ఇరువది రెండు మాత్రమే. దానికి కారణములు కూడా ప్రస్తావనలో పేర్కొనిరి.

10/10/2019 - 19:44

కావున సంఘమునందలి లోపములను వెలికితీయుటయే ప్రధానోద్దేశముగా గల వదరుఁబోతు వ్రాయసగాండ్రకు తమ పేరు మఱుగుంచుకొనుటయే కార్యసాధన మార్గముగా తోచియుండును అని, ఇప్పటికీ అనగా 1932 నాటికి కూడా ఆ వ్యాసకర్తల ఉద్దేశములట్లే యుండుటచే ఇప్పుడును వారి నామములు మఱఉగుననే ఉంచబడినవి. అనగా మొదట వ్యాసములు పత్రికలో ప్రచురించిన పదునాలుగేండ్ల తరువాత కూడా, వ్యాసకర్తలు తమ పేర్లు ప్రకటించుకొనుటకు ఇష్టపడలేదన్నమాట.

10/09/2019 - 19:07

సమాజములోని దొసగులను, సున్నితమైన హాస్యముతో మేళవించి ఎత్తిచూపిన సాక్షి వ్యాసాలను గూర్చి తెలుగు సాహితీ లోకము బాగుగా ఎరిగియున్నది. అట్లే ఆంగ్లమునందలి స్పెక్టేటరు వ్యాసములు కూడ వినుకలిలోనున్నవే. అయితే గత శతాబ్ది ఆరంభములో మొదలు, స్వామి విలాస ప్రెస్సు, అనంతపురం వారిచే అప్పటప్పటి వ్యాసములుగా ప్రచురించబడి, తదుపరి పుస్కరూపమున వెలువరింపబడిన వదరుఁబోతు వ్యాసములు నేడు కనుమరుకైనవి.

10/06/2019 - 21:41

విశ్వనాథవారి నవలా రచనలో ఈ పోకడ కొంత కనిపిస్తుంది. ఒక సాక్షి వ్యాసాల ప్రేరణతో వచ్చినవి వదరుబోతు వ్యాసాలు. రచయితలు తమ పేర్లు గోప్యంగా వుంచారు. ఒక్క పప్పూరి రామాచార్యుల పేరు వినపడుతున్నది.

10/04/2019 - 18:50

సాక్షి వ్యాసాలలో మచ్చుకు ఒకటి రెండు విషయాలు చూద్దాం. పంతులుగారికి స్వభాషాభిమానం ఎక్కువ. పరాయి భాషలు నేర్చుకొనటం జ్ఞానాభివృద్ధికేగాని, మాతృభాషను మరచిపోవటానికి కాదు. స్వభాష అనే వ్యాసంలో ఆంధ్ర బాలక సంఘంలో ఉపన్యసించటానికి వచ్చిన ఒక తెలుగువాడు తనకు తెలుగు రాదని ఆంగ్లంలో మాట్లాడతానని చెప్పాడు. ఆ సందర్భంలో జంఘాలశాస్ర్తీ నోటినుండి పానుగంటివారు పలికించిన మాటలు చూడండి.

10/03/2019 - 21:56

ఆంగ్ల సాహిత్యంలోని సెటైర్సు పోలిన వ్యంగ్య రచనలు. అధిక్షేపవచన కావ్యాలు. ఎక్కువ భాగం ఉపన్యాసాల రూపంలో వున్నాయి కాబట్టి వీటిని ఉపన్యాస వ్యాసాలు అంటే బాగుంటుంది.

10/03/2019 - 19:07

సమాజంలో రాజకీయ దండన విధించటానికి వీలులేని అనేక రుగ్మతలుంటాయి. వాటిని విమర్శించటం, ఆక్షేపించటం, ఆయా వ్యక్తులకు జ్ఞానం కలిగేట్లు ప్రయత్నించటం సాక్షి సంఘం తమ బాధ్యతగా పెట్టుకున్నది. వీరు కొన్ని నియమాలు కూడ పెట్టుకున్నారు. రాజకీయ విషయాలు ముచ్చటించకూడదు. తప్పులనేగాని, ఆ మనుష్యులను నిందించకూడదు. కలుపుకోవటం అనివార్యమైతే న్యాయ సభలకెక్కకూడదు. ఇంతవరకు బాగనేవున్నాయి. మరో నిబంధన చూడండి.

09/30/2019 - 19:43

ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతలలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులుగారు సుప్రసిద్ధులు. హాస్యరచనలో సిద్ధహస్తులు. పానుగంటివారి పేరు చెప్పగానే, అందరికి గుర్తువచ్చేవి సాక్షి వ్యాసాలు. వాస్తవానికి వారి రచనల్లో ఈ వ్యాసాలు ఒక భాగం మాత్రమే! పానుగంటివారు ప్రథమంగా నాటకకర్తలు. వీరు సుమారు ముప్ఫది నాటకాలు రచించారు. అందులో పౌరాణిక, రాజకీయ, సాంఘిక నాటకాలున్నాయి.

09/29/2019 - 22:37

చైత్ర, ఆశ్వయుజ మాసాలు ‘సంధి’కాలాలు. ప్రాణికోటికి ప్రాణాంతకాలు. యమునికి ప్రీతికరమైనవి. అందుకే వీటిని ‘యమదంష్ట్ర’లన్నారు. వీని బారినుండి తప్పించుకోడానికే పరాశక్తిని నవవిధాలుగా పూజిస్తారు.

09/29/2019 - 22:34

‘‘అలసిపోతున్నాననిపిస్తుంది రుూ మధ్య’’ అన్న లత తథాగతుని గురించి వ్రాస్తూ ‘‘మనిషి తనలో తనే కేంద్రీకృతుడైనంత కాలం బ్రతుకు గురించి అర్థం కాదు. మరొకరి కోసం బ్రతుకుతున్నప్పుడే బ్రతుకు అంటే అర్థమవుతుంది’’అంటూ బ్రతుకులోని రహస్యాన్ని వెలికితీస్తుంది.

Pages