వినమరుగైన

యాదేవీ సర్వభూతేషు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్ర, ఆశ్వయుజ మాసాలు ‘సంధి’కాలాలు. ప్రాణికోటికి ప్రాణాంతకాలు. యమునికి ప్రీతికరమైనవి. అందుకే వీటిని ‘యమదంష్ట్ర’లన్నారు. వీని బారినుండి తప్పించుకోడానికే పరాశక్తిని నవవిధాలుగా పూజిస్తారు.
‘‘యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః’’ అన్న దేవీ సప్తశతిని అనుసరించి నిరాకార రూపిణి, నిర్వికల్ప, నిరామయ. నిశ్శంక నిర్గు ణ అయన అమ్మకు రూపాలను ధరింపచేసి అమ్మను పూజించడం ఈ శరన్నవ రాత్రుల ల్లోని ముఖ్యాంశం. ‘‘నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్’’ అన్న మంత్రాన్ని అచంచలమైన నమ్మకంతో పఠిస్తే చాలు అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఏ కార్యాన్నై నా సాధించాలంటే ఈ తల్లి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.
సాత్విక పూజ మోక్షమును- రాజస పూజ సంపదను, పదవిని, ధనము వంటి వాటిని ఇస్తుందనీ- తామసిక పూజ మధ్యమమనీ శాస్తవ్రచనం. శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి మహావిద్యా, ఆదిశంకరుల సౌందర్యలహరి, త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్ర మాతృకాపుష్ప మాలాస్తవం, లలితా సహస్రనామం ఇత్యాదులన్నీ లలితాదేవి వైభవమును పలు విధాలుగా ప్రస్తుతించాయ.‘‘శివ శ్శక్త్యాయక్తో యతి భవతి శక్తః’’ ఆఖరికి శివుడైనను శక్తిని కూడిఉన్నప్పుడే సృష్ట్యాది పంచకృత్య నిర్వహణమున శక్తి కలవాడు అవుతాడు అని శ్రీశంకరభగవత్పాదులు రచించిన సౌందర్యలహరి చెప్పుతోంది. వేయిసార్లు మననం చేసే శివవిష్ణునామాలకంటే కూడా ఒక్కసారి అమ్మను తలుచుకుంటే చాలు. తల్లిని తలిచినవారికి పునర్జన్మలేనేలేదు. ఈ తల్లిని ఉపాసించటానికి కూడా తల్లి దయ తప్పనిసరిగా కావాల్సిందే. లలితాసహస్రనామాలలోని ఒక్కనామాన్ని స్మరించినప్పటికీ తల్లి దయను పొందేవీలున్నది. సహస్రనామాన్ని పఠించినవారికి దీర్ఘాయుస్సు, వంశవృద్ధి ఇలాంటివే కాక కోటిజన్మలలో చేసిన పాపం నివృత్తికూడా జరుగుతుందని హయగ్రీవుడు పలికాడు. మల్లెలు, తులసీదళాలు, కలువపూలు, కడిమిలు, సంపెంగపూలు, జాజి, మల్లికలు, గనే్నరు పూలు, కమలములు, బిల్వపత్రములు, మొల్లలు పొగడలు, పచ్చగోరింట, పొగడ పూలు, మందారము, దిరిసెన పూలు, మొగలిపూలు, విష్ణుక్రాంత, జిల్లేడు, మాధవీపుష్పాలు ఇవేకాక ఈ ఋతువులో పూచే పూలను తెచ్చి అమ్మను సహస్ర నామంతో అర్చించినవారి పుణ్యఫలం ఇంతింత అని చెప్పడానికి వీలుకానంతగా అమ్మ అనుగ్రహిస్తుందంటారు అగస్త్యులవారు.‘‘చింతామణి గృహాంతస్థా’’ అన్న నామాన్ని పరిపూర్ణమైన ఏకాగ్రతతో విశ్వాసంతో పఠించినవారికి చింతితార్థములన్నీ ప్రాప్తిస్తాయి. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమః అని జపించిన వారికి తల్లి అండగా ఉంటుంది. జగద్రక్షకి జగజ్జనని అయన అమ్మను ఏనామంతో పిలిచినాఒక్కటే. ఆర్తిగా పిలిస్తే చాలు తల్లి అనుగ్రహం సత్వరం గా లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో రకరకాలైన బొమ్మల కొలువులు అమ్మవారి అవతారాలను స్మరిస్తూ పెట్టి ముతె్తైదువులను పండు తాంబూలాలతో గౌరవించడమూ ఆచారంగా కొనసాగుతోంది.

- ఆర్. పురందర్