వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కాసు లేకున్న ఁ గంటికి ఁగానరాము
కాసు ఁ గల్గినఁ జుట్టూత ఁ గాంచుజనులు
మనుషులకుఁగాను కాసుకి మ్మహిమ విలువ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: రోజుల్లో డబ్బులేకుంటే ఇతరుల కంటికి మనం ఏమాత్రం ఆనం. అదే డబ్బుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అంతా మన చుట్టూ చేరుతుండడం అనేది సహజమై పోయింది. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ భూమీద డబ్బుకే విలువ తప్ప మనుషులకు విలువలేకుండా పోతోంది. మానవత్వమే మనుగడకు అవసరం కానీ సంపద కాదని నీవైనా తెలియజెప్పుమా.
తే.గీ. కాలవాహిని కెదురీది కష్టనష్ట
ములను సహించాలి గట్టెక్కి కలలు నిజముఁ
జేసుకొనవలె సుజనులీ జీవితాలఁ
జూడుమా కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కాలప్రవాహానికి ఎదురీది కష్టనష్టాలను ఓర్చుకుంటూ కన్నకలలు నిజం చేసుకోవాలి సుజనులు. ఈ జీవితాలను సార్థకం చేసుకోవాలని, నిరాశ నిస్పృహలను నీళ్ళొదిలేసి నిత్య చైతన్యవంతంతో మెలగాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262