S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

09/05/2019 - 19:53

వ్రాత విషయమున గల ఈ మార్పును అప్పకవీయము గుర్తించి చెప్పినది. తెనుగు శబ్దము విషయమున గల తెన్ అగు అనగా దక్షిణము అని ద్విగ్వాచిగా గ్రంథకర్తలు గ్రహించిరి. ఇదియును పండితుల ఊహ. నిజమునకు తెనుగు అనునది ఒక గడ్డి. తెనుగు బాడి అను గ్రామము విశాఖ జిల్లా యందు గలదు. తెనుగు ఉచ్ఛారణమున తెలుగు అయినది. ఆ గడ్డి విస్తారముగా పెరిగిన భూభాగము తెలంగాణము. కాణమనగ భూభాగము లేక భూమి. ఇది వాస్తవ స్థితి.

09/04/2019 - 20:01

ఆంధ్ర రాజ్య స్థాపనమును గూర్చి చర్చించిన 11వ అధ్యాయమున, సుచంద్రుని ప్రస్తావించిన బ్రహ్మాండ పురాణమునందలి విషయమును గ్రహించు మహేంద్ర పర్వతము, భీమేశ్వరము, కాళేశ్వరము, శ్రీశైలములనునవి ఆంధ్ర దేశమునకు చతుర్ద్వారములు గాను వానిని త్రిశూలపాణియైన శివుడు రక్షించుచున్నాడని అందు చెప్పబడినదని ఉటంకించిరి.

09/03/2019 - 20:13

ఇది సర్వతా విసర్జింపదగినది’’ ఇది విలువైన మాట. పాటింపదగినది.సంస్కృతి నిర్వచనము గావించిన తరువాత ఆంధ్ర దేశ భౌతిక వర్ణన గావించినారు. అందు ఆంధ్ర దేశమునందలి కొండలు, గుట్టలు, నదులు, సరస్సులు, చెరువులు, కాలువలు - అవి నెలకొన్న ప్రదేశములు, వాటి రూపురేఖా విలాసములు. వానివలన ఉపయోగములు పేర్కొనినారు.

08/30/2019 - 20:30

చిలుకూరి వీరభద్రరావు, భండార్కరు, నేలటూరి వెంకట రమణయ్య, మాగంటి బాపినీడు, డి.సి.సర్కార్, కె.గోపాలాచారి, కె.సుబ్రమణియన్, ఇ.సి.గంగూలి, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, కృష్ణస్వామి అయ్యంగార్, నీలకంఠ శాస్ర్తీ, సాలబోర్, ఫాదర్ హీరా, కురుగంటి సీతారామయ్య, సత్యనాథ అయ్యర్, బ్రిగ్స్, సురవరం ప్రతాపరెడ్డి, చాగంటి శేషయ్య, కందుకూరి వీరేశలింగము, కొమర్రాజు లక్ష్మణరావు, పి.శ్రీనివాసాచారి, ఆదిరాజు వీరభద్రరావు, పెండ్యాల సుబ్

08/29/2019 - 19:46

కళాశాలలో చదువుకొను విద్యార్థులకును, సామాన్య పాఠకులకును ఇట్టి గ్రంథమ మరియు అవసరమైనది. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి గ్రంథము ఈ కొరతను తీర్పనుద్దేశింపబడినది అని వ్రాసి యున్నారు. దీనికి తేదీ లేదు. తరువాతి ముద్రణములలో ఎట్టి సంస్కరణమలు చోటుచేసుకొనకుండుటకు, ఈ ప్రముఖుల అభిప్రాయములు కొంతకు కొంత కారణమైయుండవచ్చును. ఇక గ్రంథకర్తలు తమ గ్రంథమును గూర్చి ఇది యొక మధుకోశము.

08/28/2019 - 19:49

ఇరువైయవ శతాబ్దము గడిచి, ఇరువై యొకటవ శతాబ్దమునకు అడుగిడిన వేళ, గత శతాబ్దములో వెలువడిన ఉత్కృష్ట గ్రంథాలపై విశే్లషణలను రూపొందించడంవల్ల చారిత్రక ప్రయోజనము సిద్ధించుట తథ్యము.

08/27/2019 - 19:46

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు శ్రీ రెడ్డిగారి గ్రంథంలోని కొన్ని అభిప్రాయాలతో, పదాల వివరణతో విభేదిస్తూ జాబు వ్రాశారు. వాస్తవమే! కాని ఇవన్నీ ఒక సంస్థ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేసినందువల్ల ఏర్పడిన దిష్టిచుక్కలు మాత్రమే! శ్రీశ్రీ అన్నట్లు ‘చరిత్ర అంటే తారీఖులూ, దస్తావేజులూ కాదు’.

08/26/2019 - 20:21

ఏం తిన్నారు, ఏం కట్టుకొన్నారు, ఎట్లా ఆడారు, పాడారు- ఈ సమాచారమంతా కళ్లకు కట్టినట్లువుంది. ప్రజాజీవనం, వారి వేషభాషలు, మతం, కళలు, వ్యవసాయం, వ్యాపారం, విద్యావ్యాపకం, ఆచారాలు, వినోదాలు, స్ర్తిల అలంకరణలు, యుద్ధతంత్రం, సైనిక వ్యవస్థ, చేతి పనులు, నాణాలు, పంచాయితీ సభలు- ఇట్లాంటివి ఎన్నో ఈ పుస్తకంలో వున్నాయి. శ్రీ రెడ్డిగారు వర్ణించిన కొన్ని పిండి వంటకాలు మనకు తెలియవు. కొన్ని వంటలను మనం వినే ఉండము.

08/25/2019 - 22:26

శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీగారన్నట్లు ‘‘శ్రీరెడ్డిగారి ఇల్లే ఒక చరిత్ర భాండారాం!’’

08/21/2019 - 19:54

20వ శతాబ్దపు శతజయంతి సాహతీమూర్తులలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారొకరు. వారు తెలంగాణ జనచైతన్యానికి ఎంతో ప్రోదిచేసిన మహనీయులు. దాశరధిగారన్నట్టు శ్రీ రెడ్డిగారు ‘మూగబడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని’. అంతేకాదు, నిరంకుశ నిజాములను పిరికిపందలు అనే సంపాదకీయంలో విమర్శించగల సాహసి. గోలకొండ పత్రిక, ప్రజావాణి మొదలగు పత్రికలను నడిపి, కత్తిలోని వాదనను కలంలోనే చూపించిన దిట్ట.

Pages