S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

08/09/2019 - 19:40

కార్ రివర్స్ చేయడం రాదని చెప్పేందుకు వెనుకకు నడపడం ధీర లక్షణం కాదని సమర్థించడం నవ్వు తెప్పిస్తుంది. జానకిరాం రచనలు నోరి వారు పారేస్తే, మునిమాణిక్యం స్వదస్తూరితో వాటిని కాపీ చేసిపెట్టారట. నా కాశీయాత్ర వ్రాస్తున్న చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీగారి దర్శనం పక్షులను వేటాడే స్నేహితుడిలో లోపమున్నదని తెలిసి- లోపాన్ని సహించగలగడం జానకిరాం ఆత్మకథలో కొన్ని ఉజ్జ్వల ఘట్టాలు.

08/08/2019 - 20:09

ఒకరికి ఉపకారం చేస్తూ ఉపకారం చేయడంవల్ల తమకు లాభించినట్లు మంచివారు ప్రవర్తిస్తారట. జానకిరాంలో ఆ చొరవ, మంచితనం ఉండబట్టే వల్లభాయి పటేల్ ఉపన్యాసానికి మైక్రోఫోన్ సరిచేసే పనికి జానకిరామ్‌ను నియోగించారట.

08/07/2019 - 20:03

వనపర్తి రాణిగారు, తోడబుట్టిన సరస్వతమ్మగారు కనులవెంట అశ్రుధారలు - అతిథి మర్యాదలు- ఆ రోజులు మళ్లీ తలచుకునేందుకు చదువుతాం. పార్మసీ ఉద్యోగం తర్వాత కాన్పూర్ మిల్ యజమాని రామేశ్వరంగారల దగ్గర మూణ్ణాళ్ల ముచ్చట ఉద్యోగం- అయ్యదేవర కాళేశ్వరరావుగారు చూస్తున్న ఇన్సూరెన్స్ పనిచూసేందుకు బెజవాడ కేంద్రంగా సిమ్లా నుండి తిరుగు ప్రయాణంలో స్మృతిపథం నుండి సాగుతున్న యాత్రలో ప్రవేశిస్తాం.

08/06/2019 - 20:43

రెండు వేల ఏళ్ల క్రితం వ్రాసిన పద్యాలకు ఆంధ్రీకరణ చెప్పారటగాని ఆయన వ్రాసిన కుసుమగుచ్ఛం మాట చెప్పలేదంటూ- అది వారి నిగర్వానికి సాక్ష్యమంటారు.
పూలపూజింపుమని నిద్ర మేలుకొలిపి
తట్టలో కాయ, మొగ్గలు పెట్టినావు
నిశ్చలంబుగ మదిని ధ్యానింపు మనుచు
కుంటి ముక్కాలిపేట చేకూర్చినావు
పరవశంబుగ గొంతెత్తి పాడుమనుచు
తెగిన తంబుర చేతికందిచ్చినావు-

08/05/2019 - 18:24

మేరంగి దివాన్ ఆచంట వేంకట సాయంఖ్యాన శర్మగారి దర్శనం, సంయోగ వియోగాల గురించి
యథా కాష్ఠంచ కాష్ఠంచ సమయేతాం మహోదధౌ, శ్లోకం
సమత్యచ వ్యపేయేతాం - తద్వద్భూత సమాగమమ్

08/04/2019 - 22:32

మొదటి ప్రపంచ యుద్ధసమయంలో జానకిరాం చెన్నపట్నం చదువు మదనపల్లికి మారింది. డాక్టర్ కజిన్స్ ప్రిన్సిపాల్, కళాతపస్వి, అనిబిసెంట్ అరండేల్, జనరాజదాసలతో విలసిల్లే మదనపల్లి వాతావరణం, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ప్రత్యేక అభిమానం. టాగూర్ జనగణమన జాతీయగీతం స్వయంగా నేర్పారట.

08/02/2019 - 20:05

దాంటో ఛారమ్ ఏమిటంటే మీ అనుభవాన్ని ఎంతో భద్రంగా, ఇనే్నళ్లు- ఆప్టర్ ఈవెంట్సువల్ల ఇన్‌ఫ్లూయెన్సు కాకుండా ఐసోలేట్ చేసి, స్టెరిలైజ్ చేసి దాచి వుంచి ఈనాడు ప్రొడ్యూస్ చేయడం. ఇనే్నళ్ల తర్వాత, ఇప్పటి జానకిరామ్ కాక, ఆనాటి జానకిరామ్ ఆనాడే వీటిని రాసిపెట్టుకున్నాడా అనిపించింది. ఆ ఒక్క గుణం చాలు. అట్లాంటి రాతల్ని ప్యూర్ ఆర్ట్‌గా మార్చడానికి!’’ అంటారు.

08/01/2019 - 19:24

మూడేళ్ల వ్యవధిలో 780 పేజీలు, 65 భాగాలుగా వెలువడ్డాయి. 1958 నుండి ధారావాహిక పత్రికల్లో వచ్చాయి. సమకాలీన సంస్కృతికి - సాహిత్యానికి కళలకు.. అన్నింటికీ ఒకే మాధ్యమమైన ఆకాశవాణికి దర్పణమై నాటి తెలుగుతనపు మహోన్నత ఇంద్రచాపాన్ని, ఉజ్వల వర్ణాలతో ప్రతిబింబిస్తుంది.

07/31/2019 - 19:01

ఆల్ ఇండియా రేడియో, మద్రాస్ కేంద్రము, నిత్యజీవితంలో సౌందర్య పిపాస గురిచి శ్రీమతి క్షమించాలి శ్రీయుత అడివి బాపిరాజు ముచ్చటిస్తారు. అనౌన్సర్ జానకిరాం. ప్రకటన 63 సంవత్సరాల క్రితం సంగతి. మద్రాస్ రేడియో స్టేషన్‌కు త్రివేణి సంపాదకులు శ్రీ కొలవెన్ను రామకోటేశ్వరరావు, కవితా సామగ్రి పద్యాలతో పరిచయమైన శ్రీ కాటూరివారు, కళాతపస్వి బాపిరాజు వచ్చారు. చనువున్న మిత్రులు బాపిరాజుగారిని శ్రీమతి అని పిలిచేవారట.

07/30/2019 - 19:40

కొన్నివేళల కేవలం తిండికి లేక పడిన వెతలు.. తిండిపెట్టేవారు కొందరు అవలంభించిన కటుధోరణి.. కొందరిని ఆశ్రయించవలసి వచ్చినప్పటి మనోభావాలు.. పండితబ్రువులతో నడిచిన గొడవలు.. పంతాలు పట్టింపులు.. కొందరిలో రసికతా రాహిత్యం.. జరిగిన సన్మానాలు.. అవమానాలు అన్నీ ఈ గ్రంథంలో జంకులేకుండా వెలిబుచ్చారు శ్రీపాదవారు. ఆనాటి పెద్దలతో, ధనవంతులతో తాను అనుభవించిన కష్టసుఖాలు.. కొందరు ఆత్మీయుల ఓదార్పులు. అన్నీ.. అన్నీ..

Pages