వినమరుగైన

వదరుఁబోతు (పప్పూరు రామాచార్యులు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజములోని దొసగులను, సున్నితమైన హాస్యముతో మేళవించి ఎత్తిచూపిన సాక్షి వ్యాసాలను గూర్చి తెలుగు సాహితీ లోకము బాగుగా ఎరిగియున్నది. అట్లే ఆంగ్లమునందలి స్పెక్టేటరు వ్యాసములు కూడ వినుకలిలోనున్నవే. అయితే గత శతాబ్ది ఆరంభములో మొదలు, స్వామి విలాస ప్రెస్సు, అనంతపురం వారిచే అప్పటప్పటి వ్యాసములుగా ప్రచురించబడి, తదుపరి పుస్కరూపమున వెలువరింపబడిన వదరుఁబోతు వ్యాసములు నేడు కనుమరుకైనవి. ఒకప్పుడు అనగా 50వ దశకములోవ, ఉన్నత పాఠశాలల తెలుగు పాఠ్య గ్రంథములలో పాఠ్యంశములుగా కూడా దర్శనమిచ్చినవి. అట్టివానిలో ఒకదానిని, తొమ్మిదవ తరగతిలో ఒక పాఠ్యభాగముగా 1954లో చదువుకోవటం జరిగింది. నాడు ఆ పాఠ్యభాగము వదరుఁబోతు పేరుతో, ఏ తత్కర్త పప్పూరి రామాచార్యులుగా ప్రకటితమైనది. అంతేగాక, ఆ వ్యాసము పప్పూరి రామాచార్యులుగారి వదరుఁబోతు గ్రంథమునుండి గ్రహింపబడినదిగా చెప్పబడినది. ఆ తరువాత ఆ పుస్తకము కొరకు ఎంత ప్రయత్నించినను, గడచిన నలుబది ఏండ్లలలో సాధ్యమైనదిగాదు.
సమీక్ష చేయడానికి పూర్వం ఈ వదరుఁబోతు చరిత్ర తెలియడం కొంత అవసరంగా కనిపిస్తోంది. వృద్ధులైన పండితులకు తప్ప, నేటివారికి ఇలాంటి పుస్తకం ఒకటి వుందనే విషయం కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఈ సమీక్షకు ఆకరమైన పుస్తకం 1986 నవంబరు 9న శ్రీ పప్పూరిశేషాచార్యులుగారిచే ప్రచురింపబడినది. ఇది ద్వితీయ ముద్రణ. శ్రీ సాధన ప్రింటింగ్ లిమిటెడ్, అనంతపురంలో ముద్రింపబడినది. పప్పూరి శేషాచార్యులగారి వాక్యాలు, రామాచార్యులవారి ఛాయాచిత్రము అనుబంధంగా చేర్చిన రామయ్య పద్యాలు తప్ప మిగిలినంతా మొదట ముద్రణకు నకలుగా భావింపవచ్చును.
ఇక దాని స్థితిగతులిట్లున్నవి. మొదట ప్రకాశకుల మనవి రోమను అంకెలలో నాలుగు పేజీలు. ఇది సాధన ముద్రాలయాధికారులు 1.7.1932 తేదీతో, ప్రకాశకులుగా వెలువరించినది. పిదప వదరుఁబఓతు మొదటి వ్యాసము ప్రారంభమై, నాలుగు పేజీలు నడిచినది. దాని కొనసాగింపు అయిదవ పేజీ, నాలుగు రోమను అంకెలుగల పేజీల తరువాత కుట్టబడినది. పుస్తకము లోపల కూడ కొన్ని పేజీలు తారుమారుగా కుట్టబడ్డాయి. ఇది బహుశా ముద్రాపకుల లోపముగాక, తరువాతబైండు చేసినవారి లోపము కావచ్చునేమో. అది అలా వుండగా, రోమను పేజీలు నాలుగూ కూడా ముందు వెనుకలు ఉండడమేగాక, ఆ పుటలు 9, 10, 11, 12గా సూచించబడ్డాయి. అంటే ఎనిమిది పేజీలు లేవన్నమాట. ఉన్నవానిలవో 12వ పేజీ, అంతవరకుగల దానిలోని తప్పొప్పులను సూచించినది. గ్రంథభాగమునకు కూడా మరొక తప్పొప్పుల పట్టిక ఉంది. అదలా వుంచితే, లభ్యమైన మూడు పేజీలు ఎవరు వ్రాశారో తెలుపు సమాచారము లేదు. మొదటనున్న ప్రకాశకుల మనవిలోను, ఈ మూడు పుటలలోను స్పష్టమైన విషయములు కొన్ని గలవు. లోపించిన ఎనిమిది పుటలను, లన్యమైన ఎనిమిదిపుటలను కలిపి ప్రస్తావన అని శీర్షిక ఉన్నట్లు, తప్పొప్పుల పట్టికలో పేర్కొనుటను బట్టి తెలియుచున్నది.
ఇక అందలి విషయములు తెలియుటకు పూర్వము మొదట ఈ వ్యాసములు 1917, 1918 సం.లలో అనంతపుర విద్యార్థి సంఘము వారిచే ప్రకటిమైన పక్షపత్రికలనుండి అని తెలుపబడుచు, మొదటి ప్రచురణ 1935 అని అట్టపై ప్రచురింపబడిన దానిని బట్టి తెలియుచున్నది. ప్రస్తావన భాగములో గల మూడు పుటలలో ఇట్లు వ్రాయబడినది. ‘ఈ వ్యాసకర్తలు ఇరువురు, ముగ్గురన్నను తప్పులేదు. వారిపేర్లు ప్రచురించుటకు మాకిప్పుడధకారము లేదు. మొదట వారు ప్రకటించుకోలేదు.
కారణము జూడగా నిది అని వ్రాయు ఈ వ్యాసము ఉత్పత్తికి కారణమును వివరించుచు ‘అధికార వృద్ధులు, వయోవృదుధలు, విద్యావృద్ధులు కూడా నాచరించుచుండిన కొన్ని పద్ధతులను, ఆఛారములను తప్పులని తోచినప్పుడు విమర్శించి, ఖండించుటకై జన్మించినవీ వ్యాసములు’అని వ్రాశారు. ఇక వారు తమ పేర్లను బయట పెట్టకుండుటకు ఈ వ్యాసకర్తలు అధికార విద్యా యోధనాధులందు సామాన్యులేకాని, విశిష్టులు కారు. అట్టివారు ఇతరులను ఖండింపబూనినప్పుడు వారి పేరు ప్రచురమయ్యేనా, వారి నామధేయములకన్న నల్పముగా దలచి తిరస్కరించు జనులే ఎక్కువ. తమ్ము ఖండించు వారనామధేయులుగ మరుగుననుండిరా వారెవరో సుగృహీత నామధేయులని జనులు భావించి మన్నించుటయు సహజము.

ఇంకా ఉంది

యార్లగడ్డ బాలగంగాధరరావు