S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/06/2018 - 21:49

‘‘అదుగో మళ్లీ డే అంటున్నావ్. ప్రేమికుల రోజనలేవు’’.
‘‘తప్పయిందండీ! ఇకనుంచి అచ్చ తెలుగులోనే అచ్చం తెలుగమ్మాయిలానే మాట్లాడతానండీ!’’

03/05/2018 - 22:08

ఆఫీసరు అనంతం చాలా హడావిడిగా ఆ ఫైలు ఇటూ ఈ ఫైలు అటూ తిప్పుతూ, మధ్య మధ్య వచ్చేవాళ్ళకేవో చెబుతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇంతలో సెల్ మ్రోగింది. రిసీవ్ చేసుకున్నారు.
‘హేపీ బర్త్‌డే సార్!’ అంది అవతలి కంఠం.
ఠక్కున స్విచ్ ఆఫ్ చేసి, తిరిగి తన పని చూసుకోసాగారు. రెండు నిమిషాల తరువాత ల్యాండ్ లైను మ్రోగింది. తీశారు.
‘హ్యాపీబర్త్‌డే సార్’’ అంది తిరిగి అదే కంఠం.

03/05/2018 - 02:14

అకస్మాత్తుగా మూడు మారిన కోడలు మాటలతో నోట మాట రాక నిర్ఘాంత పోయిన హనుమాయమ్మగారు ఎందుకొచ్చిన గొడవనుకొందో ఏమో, కోడలు చెప్పిన పనులన్నీ హడావిడిగా పూర్తి చేసింది. మరి కాసేపట్లో గది నుండి బయటకు వచ్చిన సక్కు అత్తగార్ని చూసి తనలో తాను నవ్వుకొని గబగబా బత్తాయి రసం తీసుకొచ్చి ‘‘మొహమాట పడకండి అత్తయ్యగారు. మగవాళ్లు ఆఫీసులకెళ్తే ఇంట్లో వుండేది మనమే. మనమిలా కొట్టుకు చావడం ఏం బాగుంటుంది.

03/02/2018 - 22:22

‘‘ఆ చూడు సక్కూ వాళ్లకు బత్తాయికాయల రసం తీసి, తలో పెద్ద గ్లాసెడు ఇవ్వు’’ అంటూనే బత్తాయి కాయల మూట, కత్తిపీట తెచ్చి సక్కు ముందుంచింది హనుమాయమ్మగారు.

03/01/2018 - 22:13

‘‘మీకెందుకండీ అత్తయ్యగారూ! ఆ శ్రమ. ఉండండి. నే చేస్తాగా!’’ అంటూ వచ్చి కూర్చొని, క్షణాల్లో ఆ పని పూర్తి చేసి, ఆ వెంటనే ఇడ్లీ తయారు చేసింది సక్కు. వాళ్లాయన కుక్కుటేశ్వరరావు కూడా లేచాక, అందరి కాలకృత్యాలు అయ్యాక, డైనింగ్ టేబిల్ దగ్గర చేరారు. ఇడ్లీలు నోట్లో పెట్టుకుంటే గులకరాళ్లలా వున్నయ్. ఏమంటే ఏం ప్రమాదమో అని, గట్టిగా కొరికి కొరికి తిన్నారు. కుక్కుటేశ్వరరావు ఆఫీసు కెళ్లాడు.

03/01/2018 - 01:00

‘‘పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్ప వృక్షాయ సమతాం కామధేనవే’’ అంటూ పూజ ముగించారు హయగ్రీవాచారిగారు. హనుమాయమ్మగారు మహానైవేద్యం తెచ్చి పెట్టారు. ఆ నైవేద్యాన్ని దేవునికి నివేదన చేస్తున్నట్లుగా చెయ్యి చూపించి, హనుమాయమ్మగారి కొంగు పట్టుకొని లేచారు.

02/27/2018 - 22:04

అయితే తను వౌనంగా వున్నా ఎవరూ లేచి వెళ్ళనందున, తను అంతకుముందు విసరిన ఛలోక్తికి తిరిగి ఆనందించి ఉంటారని, సంతోషంగా సమాధానపడి మళ్లీ మొదలెట్టారు.

02/26/2018 - 21:49

ఆ గోల తట్టుకోలేక తన లాంటి ఈగో వున్న మరో తెలిసిన ఆమె ప్రక్కన వెళ్లి కూర్చుంది. ఆవిడ ఈవిడను చూసి ఆవిడ తింటున్నంత ఆనందంగా ‘‘నేను లలితా సహస్రనామ పారాయణం వెయ్యిసార్లు చేశాను. ఎంతమంది చేతతోనో చేయించాను’’ అంది. అంతకన్నా రెట్టింపుగా ఈ శోభిత మీకు తెలీదేమో నేను రామకోటి పుస్తకాలు రాస్తూనే వున్నా. ఇక ఆ రాముడొచ్చి తీసుకెళ్ళడమే తరువాయి’’ అంది. మరోచోట చేరిన స్ర్తిలు ఇలా మాట్లాడుకుంటున్నారు.

02/27/2018 - 22:06

షణ్ముఖశ్రీ చిన్న కథలు
*
ఆనాడు తొలి కార్తీక సోమవారం కావడాన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మల్లికార్జునస్వామికి జరుగుతున్న అభిషేకం తాలూకు నమక చమకాలు సుస్వరంతో మైకులో వినిపిస్తున్నయ్. క్యూలో వున్న భక్తులు వింటూ పరవశించి ముందుకు సాగిపోతున్నారు.

Pages