వినమరుగైన

సాక్షి( పానుగంటి లక్ష్మీ నరసింహారావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతలలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులుగారు సుప్రసిద్ధులు. హాస్యరచనలో సిద్ధహస్తులు. పానుగంటివారి పేరు చెప్పగానే, అందరికి గుర్తువచ్చేవి సాక్షి వ్యాసాలు. వాస్తవానికి వారి రచనల్లో ఈ వ్యాసాలు ఒక భాగం మాత్రమే! పానుగంటివారు ప్రథమంగా నాటకకర్తలు. వీరు సుమారు ముప్ఫది నాటకాలు రచించారు. అందులో పౌరాణిక, రాజకీయ, సాంఘిక నాటకాలున్నాయి. సారంగధర, విప్రనారాయణ, రాధాకృష్ణ మొదలైన నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. శిల్పంలో, సంభాషణా చాతుర్యంలో, రసధ్వని అలంకారాలలో ఈ నాటకాలు ఉన్నత స్థాయికి చెందినవి. వీరి దృష్టిలో సాక్షి వ్యాసాలకంటె నాటకాలే గొప్పవి. కానీ సాక్షి వ్యాసాలకే ప్రజాదరణ మెండుగా లభించింది. ఆధునిక కాలంలో సామాన్య పాఠకుల సంఖ్య పెరగటం వ్యాసా లు వాచ్యంగా, చమత్కారంగా, వివరణాత్మకంగా వుండటం, ఆంధ్రపత్రికలో ప్రచురింపబడటం ఈ బహుళ జనాదరణకు హేతువులు కావచ్చు. విష్ణు నామమాల స్తోత్రం, కథాలహరి, హాస్యవల్లరి, మరికొన్ని వ్యాసాలు వీరు రచించారు. ఇంత విస్తృతమైన సాహిత్యం సృష్టించిన వారిని వ్రేళ్ళమీద లెక్కించవచ్చు.
పానుగంటివారు 1865 ఫిబ్రవరి 11న రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించారు. వీరు పెద్దాపురం హైస్కూలులో ఉపాధ్యాయులుగా తమ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తరువాత లక్ష్మీ నరసాపురం ఎస్టేటు జమిందారిణి చెల్లయ్యమ్మారావు గారి దగ్గర దివాను పదవి నిర్వహించారు. తదనంతరకాలంలో అనెగొందె, ఉర్లాము సంస్థానాలలో కూడా దివానుగా వున్నారు. ఆ తరువాత పిఠాపురం రాజా శ్రీ రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దరు వారి ఆస్థాన కవిగా బహుకాలం గౌరవం పొందారు. ప్రజాజీవితంతో వీరికున్న ఈ విశేష అనుబంధం వారి రచనలలో ప్రతిబింబించింది. నర్మదా పుకుత్సీయం నాటకం రచించినపుడు, ఆంధ్రకాళిదాసని, సాక్షి వ్యాసాలు వ్రాసిన తరువాత ఆంధ్ర ఎడిసన్ అని సాహిత్యలోకం వీరిని ప్రశంసించింది. సప్తతి పూర్తి ఉత్సవంలో వీరు కవి శేఖరులుగా కీర్తింపబడ్డారు.
విశేషంగా పద్యకావ్యాలు వ్రాయకపోయినా వీరు కవిశేఖరులే! కావ్యేషు నాటకం రమ్యం అని గదా ఆర్యోక్తి. బహునాటకకర్త, కవితా వచన రచనాదురంధరులైన వీరికి ఆ బిరుదెంతో తగివున్నది.
పానుగంటివారికి వచన రచన చాలా ఇష్టం. పద్యంకన్న గద్యం తక్కువనే అభిప్రాయం తప్పని, రకరకాల శాస్త్రాలు విస్తరిల్లుతున్న ఈ రోజుల్లో, వచన గ్రంథాలు అవశ్యకమని విశేషంగా వచన రచనలు వెలువడితే గాని మన సాహిత్యం సుసంపన్నం కాదని వీరు అభిప్రాయపడ్డారు. ఇతర భాషల్లోలాగ వివిధమైన వచనశైలి రీతుల్ని మన భాషలో నిర్మించాలని వీరు తాపత్రయపడ్డారు. సాక్షి రచనలో అనేక వచన రచనా రీతుల్ని పండించారు.
సాక్షి వ్యాసాలు హాస్య రసప్రధానమైన ప్రహసనాలు కావు. ఇతర విధాలైన హాస్యరచనలు కూడా కావు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పింగళి వెంకట కృష్ణారావు