వినమరుగైన

ఊహాగానం ( తెనే్నటి హేమలత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలసిపోతున్నాననిపిస్తుంది రుూ మధ్య’’ అన్న లత తథాగతుని గురించి వ్రాస్తూ ‘‘మనిషి తనలో తనే కేంద్రీకృతుడైనంత కాలం బ్రతుకు గురించి అర్థం కాదు. మరొకరి కోసం బ్రతుకుతున్నప్పుడే బ్రతుకు అంటే అర్థమవుతుంది’’అంటూ బ్రతుకులోని రహస్యాన్ని వెలికితీస్తుంది.
ఆ తర్వాత రాజులు, మహరాజులు, మహాకవులు, జగదేక సుందరీమణులు వారంతా ఏరి? ఏమైపొయ్యారు? అన్న ప్రశ్నతో మొదలెట్టి రచయిత ఆవేదన, చీకట్లో తడుముకుంటూ వెలుగును వెతుక్కుంటూ స్వేచ్ఛగా సాగుతుంటే ఆ వ్యధలో ఉద్భవించే రచనే గొప్ప రచన అంటుంది. ఇదంతా ఒక సూత్రధారుడు ఆడిస్తున్న విశ్వనాటకం అంటుంది.
ఆకాశవీధిలో స్వేచ్ఛగా ఎగిరి ఎగిరి అలసిన రెక్కలతో చెట్టు మీద వాలి చుట్టూ వీక్షించే విహంగం జ్ఞాపకం వస్తుంది మనకు.
కరుణశ్రీ పద్యం,
‘తీరిక లేని విశ్వ సంసారమందు
అలసిపోయితివేమొ దేవాదిదేవ
ఒక్క నిమేషమ్ము కన్నుమూయుదువుగాని
రమ్ము తెరచితి మా కుటీరమ్ము తలుపు’’
అని మొదలెట్టి ‘‘ఆ అతిథి కోసం ఆంతర్యపు ద్వారం తెరిచి వుంచటమే మంచిది. ఆ సమయంలో కన్నీరు యింకకుండా కంఠం జీరపోకుండా కాపాడుకోండి’’ అంటూ ఒక భక్తురాలిగా హెచ్చరిస్తుంది.
సంఘ జీవితాన్ని గురించి చివరగా రెండు మాటలు చెబుతుంది ఆమె. ‘‘సంఘ జీవితాన్ని సౌఖ్యవంతంగా నిర్వర్తించుకోవడం ఎంత కష్టమో, ఆ నిర్మించుకున్న జీవితాన్ని విచ్ఛిన్నం కాకుండా నిలుపుకోవడం కూడా అంత కష్టమే’’ అంటూ ‘‘ఈ యాంత్రిక యుగంలో సౌఖ్యంగా వుందేమోగానీ శాంతి లేదు’’ అన్న లతగారి మాటలు అక్షర సత్యాలు.
ఇక ఆఖరి మాటగా ఊహాగానం మీద ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘‘అసలు జీవితమే ఒక ఊహాగానం. కలకే బలముంటే విలువలు తలక్రిందై కవి కోరే స్వర్గం భువికి దిగుతుంది. బ్రతుకు పున్నమిగా మారుతుంది అంటూ ఈ దిక్కుమాలిన బ్రతుకులో కలలు శాంతినీ, సుఖాన్నీ యిస్తాయి. నవనవోజ్వలమైన మరో ప్రపంచానికి క్షణాలమీద మనసుని తీసుకుపోతాయి’’ అంటుంది.బ్రతుకు దిక్కుమాలినదైనా కాకపోయినా, మనిషి కలలు కనకుండా, ఎప్పుడోప్పుడు ఊహాలోకాల్లో విహరించకుండా వుండలేడు. మరీచికలాంటి మనసును ఏ ఇంద్రజాలిక జగత్తుకో ఎత్తుకుపోవడం ఊహాగానానికే సాధ్యమంటుంది లత. అందులోనూ కవులూ, రచయితలూ, కళాకారులూ, స్పందించే హృదయమున్నవాళ్ళు మరీ ఎక్కువగా ఊహగల వాహనాలెక్కి కలల ప్రపంచంలో విహరించడం మామూలే. ఎటొచ్చీ ఆ ఊహా ప్రపంచంలోనే వుండిపోతేనే ప్రమాదం. లత ఊహాగానంలో చెప్పినట్లు వాస్తవ ప్రపంచాన్ని మరవనంతవరకూ ఊహలు మనిషికి ఊరట కల్గిస్తాయి. ఆంధ్ర సాహిత్య రంగంలో ముఖ్యంగా లత సాహిహిత్యంలో ఊహాగానం ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రచన అనటంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని వివిధ కోణాలలో పరిశీలించి, విశే్లషించిన అక్షరరూపమే ఊహాగానము.

సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఎ. తేజోవతి