వినమరుగైన

సాక్షి( పానుగంటి లక్ష్మీ నరసింహారావు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో రాజకీయ దండన విధించటానికి వీలులేని అనేక రుగ్మతలుంటాయి. వాటిని విమర్శించటం, ఆక్షేపించటం, ఆయా వ్యక్తులకు జ్ఞానం కలిగేట్లు ప్రయత్నించటం సాక్షి సంఘం తమ బాధ్యతగా పెట్టుకున్నది. వీరు కొన్ని నియమాలు కూడ పెట్టుకున్నారు. రాజకీయ విషయాలు ముచ్చటించకూడదు. తప్పులనేగాని, ఆ మనుష్యులను నిందించకూడదు. కలుపుకోవటం అనివార్యమైతే న్యాయ సభలకెక్కకూడదు. ఇంతవరకు బాగనేవున్నాయి. మరో నిబంధన చూడండి. సభ జరుగుతున్నంతసేపు మత్తు ద్రవ్యములను ముక్కునుండి గాని, నోటినుండిగాని లోనికి చప్పుడగునటుల పోనీయరాదు. ఇక్కడే వున్నది పానుగంటివారి వ్యంగ్యం. కొందరు సభల్లో బుర్రుమని గుండెలదిరే చప్పుడు చేస్తూ ముక్కుపొడం పీలుస్తుంటారు. మరికొందరు మహానుభావులు చిటికలు వేస్తూ, హాహాగారాలు చేస్తూ సిగరెట్టు కాలుస్తుంటారు. అలాంటివారికి పానుగంటి వారంటించిన చురక ఇది.
ఈ సంఘంలో సాక్షి పానుగంటివారే. ఇతర సభ్యులలో హాస్యానికి కావలసిన లక్షణాలన్నీ వున్నాయి. జంఘాల శాస్ర్తీ వాచాలత్వం, కాలాచార్యుడి వికృతరూపం, వాణీదాసు అసూయ గుమ్మం పట్టని బొఱ్ఱయ్య సెట్టి ఆకారం, పైగా తామర- ఇలా ఈ పాత్రలను సృష్టించి వ్యాసాల్లోని హాస్యరస ప్రాధాన్యాన్ని రచయిత సూచించాడు. బొఱ్ఱయ్య సెట్టి మరణం తరువాత ఆస్థానంలో సి.బాలనాగమ్మ అనే ఆమెను సభ్యురాలిగా చేర్చుకున్నారు. ఆమె నామమాత్రపు సభ్యురాలే. మొదట్లో సాక్షి ఆధిక్యం గోచరించినా క్రమంగా సాక్షి ప్రతినిధిగా జంఘాల శాస్ర్తీ ఎదిగాడు. పానుగంటివారు సహజ సంభాషణా చతురులు. తాను నవ్వకుండా ఇతరులను నవ్వించేవారట. ఇదే ఉత్తమమైన హాస్యం. భమిడిపాటి కామేశ్వర్రావు గారన్నట్లు తాను నవ్వుతూ హాస్య ప్రసంగంచేసేవాడు. తింటూ వడ్డించేవాడి లాంటివాడు. సప్తతి పూర్తి ఉత్సవంలో మిత్రులు పానుగంటివారికి ఏవో బహుమతులిచ్చారట. అప్పుడు వారు ‘ఒక మతి వుండి అది సరిగా వినకుండిన బాధపడు. నాకు బహుమతులిచ్చి ఏల బాధింతురు’ అన్నారట. పానుగంటివారు గ్రాంథిక భాషావాదులు. వ్యావహారిక భాషకు దగ్గరగా వున్న గ్రాంథికమది. ఆ శైలి హిమశిఖర జలపాతం. చిత్రాతిచిత్రంగా భావానికి తగ్గట్లు ఒకచోట ఉరకలు వేస్తూ ఒకచోట గంభీరంగా నడుస్తూ పఠితలను ఆకట్టుకుంటుంది. అది కొబ్బరి, కలకండ ముక్కల సమాహారం. వ్యాసాలలో శాఖా సంక్రమణం ఎక్కువ. అధిక్షేపణలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్యోక్తులు కోకొల్లలు. అప్పుడప్పుడు పదునెక్కువై అవి గాయాలు కూడా చేస్తుంటాయి. ఈ వ్యాసాలు సంఘానికి ప్రతిరూపాలు. ఇందులోని కొన్ని కథలు, కొన్ని లేఖలు, మరికొన్ని ఉపన్యాసాలు. మన సంస్కృతి, నాగరికత, విదేశీయ వ్యామోహం, అవినీతి, సంస్కరణ, మూఢాచారాలు, స్ర్తిల సమస్యలు ఒకటేమిటి అన్ని సామాజిక విషయాలూ ఈ వ్యాసాలలో చోటుచేసుకున్నాయి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

ఇంకా ఉంది

పింగళి వెంకట కృష్ణారావు