S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/18/2016 - 16:27

గుంటూరు: తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కనికరించని కిడ్నాపర్లు బాలుడ్ని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా ఏటి అగ్రహారంలో జరిగింది. ఈనెల 14న ఆదిత్యరాజ్ అనే బాలుడిని కిడ్నాప్ చేసిన ఆగంతుకులు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతడబ్బు ఇచ్చుకోలేని బాలుడి తల్లిదండ్రులు రెండు లక్షలను కిడ్నాపర్లకు చెల్లించారు.

04/18/2016 - 12:50

విశాఖ: అచ్యుతాపురం వద్ద బ్రాండిక్స్ సెజ్ వద్ద మహిళా కార్మికులు సోమవారం ఉదయం బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జీతాలు పెంచాలని, పిఎఫ్‌ను సక్రమంగా జమ చేయాలని తదితర డిమాండ్లను తీర్చకుంటే తాము విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులతో అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రమేష్‌బాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

04/18/2016 - 12:50

విజయవాడ: ఎంసెట్‌తో పాటు అన్ని ప్రవేశ పరీక్షలను వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు యోచిస్తున్నామని, ఈ విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఎంసెట్‌కు సన్నాహాలపై ఆయన సోమవారం ఇక్కడ సమీక్ష జరిపారు.

04/18/2016 - 12:49

విజయవాడ: ఎపిలో గతనెలలో జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను మంగళవారం ఇక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. ఈ నెల 20న ప్రథమ, రెండు రోజుల తర్వాత ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ, మూల్యాంకన ప్రక్రియ పూర్తికావడంతో 19నే ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.

04/18/2016 - 12:48

విజయవాడ: వేసవిలో తాగునీటి సమస్య, పర్యాటక పథకాలకు భూముల కేటాయింపు, జన్మభూమి కమిటీలు, ఖరీఫ్ పంటలకు ప్రణాళిక తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం ఇక్కడ ఎపి మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశం అనంతరం టిడిపి జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమవుతారు.

04/18/2016 - 12:48

రాజమండ్రి: ఓ మహిళను కిడ్నాప్ చేసి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని మిగతా ముగ్గురి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులంతా రౌడీషీటర్లేనని, వీరిపై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు చెబుతున్నారు.

04/18/2016 - 12:47

కడప: ఎటిఎంలలో నగదు పెట్టే సిబ్బందిపై ఆకస్మికంగా దాడి చేసి సుమారు 53 లక్షల రూపాయలను దుండగులు దోచుకున్న ఘటన సోమవారం ఉదయం పులివెందుల పట్టణంలో జరిగింది. నగదు తెచ్చిన ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కళ్లలో కారం చల్లి, ఇనుప రాడ్లతో దుండగులు దాడి చేశారు. స్టేట్‌బ్యాంకు ఎటిఎంలలో పెట్టేందుకు నగదును తీసుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది.

04/18/2016 - 12:47

శ్రీకాకుళం: రాజాం మండలం గురవాం గ్రామంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో వంటగ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని రాజాం ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీక్ అయినందునే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు.

04/18/2016 - 08:19

విజయనగరం (టౌన్), ఏప్రిల్ 17: రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకునేందుకు అంత్యోదయ పథకాన్ని ప్రారంభించనున్నామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు.

04/18/2016 - 07:51

హైదరాబాద్, ఏప్రిల్ 17: ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను పెంచారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కృష్ణా నది తీరంలో ఉండవల్లి వద్ద ఒక ప్రైవేట్ విశ్రాంతి గృహమే ప్రస్తుతం చంద్రబాబు తాత్కాలిక నివాసంగా ఉంది. గత ఏడాది 6నెలలుగా చంద్రబాబు ఆ విశ్రాంతి గృహంలో ఉంటున్నారు. దీంతో ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా పెరిగింది.

Pages