ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఏడాది నుంచి అన్ని ‘సెట్’లు ఆన్‌లైన్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎంసెట్‌తో పాటు అన్ని ప్రవేశ పరీక్షలను వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు యోచిస్తున్నామని, ఈ విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఎంసెట్‌కు సన్నాహాలపై ఆయన సోమవారం ఇక్కడ సమీక్ష జరిపారు. తెలంగాణలోనూ ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినందున అక్కడ విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై తెలంగాణ సర్కారుతో ఎపి డిజిపి, ఇతర అధికారులు చర్చిస్తారు. మంత్రులు పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎంసెట్ పరీక్షా కేంద్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.