S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/19/2016 - 12:23

విజయవాడ: గిరిజన మహిళా సర్పంచ్‌ల సదస్సు మంగళవారం ఇక్కడ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఎపి సిఎం చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా నృత్యం చేశారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్‌ల సమస్యలను ఈ సదస్సులో చర్చిస్తారు.

04/19/2016 - 12:22

విజయవాడ: ఎపిలో తొలిసారిగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ఒకేరోజు విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడ ఎపి మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేసి అత్యధిక మార్కులు సాధించిన వారిని అభినందించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే ఉత్తీర్ణతా శాతంలో టాప్‌గా నిలిచారు.

04/19/2016 - 06:41

విజయవాడ, ఏప్రిల్ 18: జన్మభూమి, మావూ రు కమిటీలను మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. క్యాబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రెండు కమిటీల్లోని సభ్యులు పెత్తందారీ వ్యవస్థ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు.

04/19/2016 - 06:29

విజయవాడ, ఏప్రిల్ 18: గ్రామ వికాసం నుంచి భారత వికాస పథకంలో భాగంగా గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచుల జాతీయ సదస్సు మంగళవారం విజయవాడలో జరుగనుంది. ఐదవ షెడ్యూల్‌లో పేర్కొన్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెయ్యి మంది సర్పంచులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

04/19/2016 - 06:28

హైదరాబాద్, ఏప్రిల్ 18 : ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయితీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈ నెల 29, 30 తేదీలలో ఉపఎన్నికలు నిర్వసించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్, సామర్లకోట మున్సిపాలిటీ వైస్-చైర్మన్ పోస్టులకు 29 న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

04/19/2016 - 06:28

తిరుపతి, ఏప్రిల్ 18: తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో సుదీర్ఘకాలం పనిచేస్తూ విశేష అనుభవాన్ని గడించిన వ్యాకరణ విభాగం అధిపతి ఆచార్య శ్రీపాద సత్యనారాయణ మూర్తిని ఇన్‌చార్జ్ విసిగా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆచార్య హరేకృష్ణ శతపతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.

04/19/2016 - 06:27

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు పెంపుదలకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చారని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

04/19/2016 - 06:27

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఆర్కిటెక్చరల్ సలహా కమిటీని నియమిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి చైర్మన్‌గా ప్రొ.క్రిష్ట్ఫోర్ బెన్నింగర్, సభ్యులుగా డాక్టర్ ఎర్విన్ వైరే, కేశవ్ వర్మ, ప్రొ.కె.టి.రవీంద్రన్, ప్రొ.సుహ ఓజ్‌కాన్, రాజీవ్ సేథిలను నియమించింది.

04/19/2016 - 06:26

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సిలకు 2015-16 సంవత్సరంలో ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రెండు నెలల పాటు పొడిగించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గడువు వాస్తవంగా 2016 మార్చి 31తో ముగిసిందన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపారు.

04/19/2016 - 06:25

హైదరాబాద్, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ విద్యాసంస్థలలో ప్రవేశానికి ఈ నెల 21న జరగాల్సిన ప్రవేశపరీక్షను 23వ తేదీకి వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. 9వ తరగతిలో ప్రవేశానికి మాత్రం పరీక్ష ఏప్రిల్ 23న ఉదయం 11 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇంటర్‌లో చేరేందుకు ఏప్రిల్ 23న ఉదయం 11 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుంది.

Pages