ఆంధ్రప్రదేశ్‌

పెత్తందారుల్లా వ్యవహరించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: జన్మభూమి, మావూ రు కమిటీలను మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. క్యాబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రెండు కమిటీల్లోని సభ్యులు పెత్తందారీ వ్యవస్థ మాదిరిగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విలేఖరులు ప్రశ్నించగా ఈ కమిటీలు పెత్తందారీ వ్యవస్థ కాదన్నారు. జన్మభూమి కమిటీలపై మరోసారి అందరి అభిప్రాయం తీసుకుని తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన మం త్రివర్గ సమావేశంలో చెప్పారు. దీంతో జన్మభూమి కమిటీల రద్దు తాత్కాలికంగా వాయిదాపడినట్టే.
ఈ-ప్రగతికి పీపుల్స్ హబ్
రాష్ట్రంలో ఈ-ప్రగతి కింద పీపుల్స్ హబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పీపుల్స్ హబ్ ఏర్పాటు చేసే బాధ్యతను ఒరాకిల్ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 5 కోట్ల జనాభా పూర్తి వివరాలను ఈ సంస్థ సేకరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులు అందరి దగ్గర విడివిడిగా ఉన్నాయని, వీటన్నింటినీ ఒకే కార్డు కింద మార్చే సాంకేతిక పరిజ్ఞానం ఒరాకిల్ వద్ద మాత్రమే ఉందని చెప్పారు. దీనివల్ల ఏ కులంలో ఎంతమంది పేదలు ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తుందని, వారి సామాజిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ విషయంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నామని తెలిపారు. అలాగే వ్యవసాయం, స్కిల్ డెవలప్‌మెంట్, డ్వాక్రా సంఘాలను అభివృద్ధి చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
రాష్ట్రంలో టవర్ కార్పొరేషన్
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇష్టానుసారంగా సెల్‌టవర్లు ఏర్పాటు చేస్తున్నారని, ఇకపై ప్రభుత్వమే ఒక క్రమపద్ధతిలో టవర్లను ఏర్పాటు చేస్తుందని, ఇందుకోసం టవర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు ఈ టవర్లను వినియోగించుకుని, ప్రభుత్వానికి సొమ్ము చెల్లిస్తాయని చెప్పారు. డిజిటల్ కంటెంట్‌కు వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల ఇళ్లల్లోని విద్యుత్ మీటర్ల రీడింగ్, ట్రాన్‌ఫార్మర్ల వద్గర రీడింగ్‌ను విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు.
ఎన్టీఆర్ సంచార వైద్య చికిత్స
రాష్ట్రంలో కొత్తగా ఎన్టీఆర్ సంచార వైద్య చికిత్సను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఈ నెల 20న 275 వాహనాలను రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.