ఆంధ్రప్రదేశ్‌

నేడు గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: గ్రామ వికాసం నుంచి భారత వికాస పథకంలో భాగంగా గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచుల జాతీయ సదస్సు మంగళవారం విజయవాడలో జరుగనుంది. ఐదవ షెడ్యూల్‌లో పేర్కొన్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెయ్యి మంది సర్పంచులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్ అధికారులు పాల్గొనే ఈ సదస్సును సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు నిహాల్ చంద్, సుదర్శన్ భగత్, జ్యూయల్ ఓరమ్, బీవేంద్ర సింగ్ హాజరుకానున్నారు. ప్రారంభ సభలో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఒక్కో గిరిజన మహిళా సర్పంచు తమ పరిపాలనా అనుభవాలను వివరిస్తారు. తొలి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయి. రెండోరోజు బుధవారం కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో 12 అంశాలైన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, బయోమెట్రిక్ పింఛను పంపిణీ, ఈ-పోస్, ఈ-అటెండెన్స్, ఈ-ఆఫీస్, శానిటేషన్ మొదలగు వాటిని వారు పరిశీలిస్తారు. సాయంత్రం భవానీ ద్వీపంలో రంపచోడవరం, పాడేరు గిరిజన ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక హాజరుకానున్న ప్రతినిధుల కోసం ఇప్పటికే నగరంలో 37 హోటళ్లలో 630 గదులు బుక్ చేశారు. తాత్కాలికంగా మూడు హెలిప్యాడ్‌లు, రైల్వే, బస్ స్టేషన్‌లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు స్థానిక కలెక్టర్ బాబు.ఎతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు.