S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/19/2016 - 05:21

ఒంటిమిట్ట, ఏప్రిల్ 18: మరో అయోధ్యగా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదోరోజు సోమవారం ఉదయం నవనీత కృష్ట అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు ఊంజల్ సేవ నిర్వహించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం రాత్రి రామయ్య ప్రియ శిష్యుడైన హనుమత్ వాహనంపై సీతారామలక్ష్ముణులు పురవీధుల్లో దర్శనమిచ్చారు.

04/19/2016 - 05:19

గుంటూరు (క్రైం), ఏప్రిల్ 18: నాలుగు రోజుల క్రితం ట్యూషన్‌కు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి ఆదిత్యసాయిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. 15 లక్షల రూపాయలు కావాలంటూ తల్లిని డిమాండ్ చేసి.. వారి మధ్య చర్చలు విఫలం కావడంతో ప్రాణాలు తీసిన బాలుడిని ఫిరంగిపురంలోని సిరంగిపాలెం గ్రామ చెరువులో పడేశారు.

04/19/2016 - 05:18

విజయవాడ, ఏప్రిల్ 18: జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితుల్లోనూ జూన్ నెలాఖరులోగా కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం రెగ్యులర్ పనులను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తూనే పుష్కర పనులు గడువులోగా పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలంటూ జలవనరులు, మున్సిపల్ శాఖలకు సూచించారు.

04/19/2016 - 05:17

శ్రీకాకుళం, ఏప్రిల్ 18: ప్రధాని మోదీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్ పరిశ్రమల యాజమాన్యాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆరోపించారు. యాజమాన్యాల తీరుతో కార్మికులు పస్తులుంటున్నా పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

04/19/2016 - 05:16

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 18: రాయలసీమలో భానుడి భగభగలు తగ్గటం లేదు. కడప నగరంలో 44.02 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అనంతపురంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు నగరంలో 43 డిగ్రీలుగా నమోదయింది. కడప, అనంతపురం జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఆరుగురు మృతిచెందారు.

04/19/2016 - 05:12

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 18: రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాను టిడిపిలో చేరుతున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సజయ్‌కృష్ణా రంగారావు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రంగారావు తన సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బేబీనాయనతో కలిసి విజయనగరంలో అశోక గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.

04/19/2016 - 05:11

రాజాం, ఏప్రిల్ 18: శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గురవాం గ్రామంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో బాణసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందారు. తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాలవలస చంద్రరావు, పాలవలస పోతయ్య, పాలవలస విజయకుమార్ గత కొంతకాలంగా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారుచేస్తున్నారు.

04/19/2016 - 05:11

సింహాచలం, ఏప్రిల్ 18: శతాబ్ధాల చరిత్ర గల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆనువంశిక ధర్మకర్తగా కేంద్రమంత్రి అశోక గజపతిరాజు సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ ఆస్థాన మండపంలో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ అశోక గజపతిరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు.

04/18/2016 - 18:15

హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేస్తూ ఎపి ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టుపై దాఖలైన ఓ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రాజెక్టు పూర్తయ్యాక కోర్టుకు రావడం ఎందుకని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

04/18/2016 - 18:14

విశాఖ: విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, ఆ విషయమై కేంద్రాన్ని నిలదీసే దమ్ము ఎపి ప్రభుత్వానికి లేదని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈరోజు ఇక్కడ మీడియాతో అన్నారు. రైల్వేజోన్ ఏర్పాటయ్యేంతవరకూ తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

Pages