ఆంధ్రప్రదేశ్‌

హనుమద్వాహనంపై కోదండ రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 18: మరో అయోధ్యగా విరాజిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదోరోజు సోమవారం ఉదయం నవనీత కృష్ట అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు ఊంజల్ సేవ నిర్వహించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం రాత్రి రామయ్య ప్రియ శిష్యుడైన హనుమత్ వాహనంపై సీతారామలక్ష్ముణులు పురవీధుల్లో దర్శనమిచ్చారు. టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా హనుమంత వాహనంలో స్వామివారిని ఊరేగించారు. అంతకుముందు అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛరణల మధ్య వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అద్భుతమైన నవనీతకృష్ణ అలంకారంతో నీలమేఘ శ్యాముడు సీతమ్మ, లక్ష్మణస్వామితో కలసి దర్శనమిచ్చాడు. ఐదవరోజు కూడా భక్తులు పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి చైర్మన్ కృష్ణమూర్తి, డిప్యూటీ ఇఓ బాలాజీ, టిటిడి అధికారులు, భక్త బృందం పాల్గొంది. మంగళవారం ఆరోరోజు సాయంత్రం మోహినీ అలంకారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి గరుడ వాహనంపై ఊరేగనున్నారు.