S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2016 - 03:43

విజయవాడ, ఏప్రిల్ 19: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. ఐదో షెడ్యూలుకు చెందిన 10 రాష్ట్రాల గిరిజన మహిళా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇక్కడి ఎ కనె్వన్షన్ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు.

04/20/2016 - 03:37

భీమవరం, ఏప్రిల్ 19: ఆటలాడుతూ, నిలిపివుంచిన కారు ఎక్కిన చిన్నారులు ఊపిరిఆడక మృత్యువాతపడిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఈ ఘటనలో మృతిచెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన మరో సోదరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

04/19/2016 - 17:03

శ్రీకాకుళం: బిసి వసతిగృహంలో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో చదివిన పేదింటి విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాడు. రాజాంలోని విద్యా జూనియర్ కళాశాలకు చెందిన చీపురుపల్లి సంతోష్‌కుమార్ (ఎంపిసి) ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించాడు. ప్రతిభావంతుడు కావడంతో ఈ కుర్రాడికి విద్యా జూనియర్ కళాశాలలో ఎటువంటి ఫీజులు లేకుండా ఉచితంగా సీటు ఇచ్చారు.

04/19/2016 - 17:02

హైదరాబాద్: ఎపిలో కరవు పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి సహాయక చర్యలు తీసుకోనందుకు నిరసనగా వచ్చే నెల 2న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరపాలని, ఖాళీ బిందెలతో ఆందోళనలు నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో వైకాపా అధినేత వైఎస్ జగన్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

04/19/2016 - 17:00

ఒంగోలు: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు వద్ద మంగళవారం ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు.

04/19/2016 - 15:26

రాజమండ్రి: పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గిరిజనులకు న్యాయం జరిగేలా ఉద్యమం చేపడతామని సిపిఎం నేత రాఘవులు తెలిపారు. తెలంగాణ నుంచి ఎపిలోకి విలీనమైన మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోనందున గిరిజనులతో కలిసి తాము పోరుబాట పడతామన్నారు.

04/19/2016 - 15:25

విజయవాడ: మహిళలు సర్పంచ్‌లుగా ఉన్న గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ మంగళవారం ప్రారంభమైన గిరిజన మహిళల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం,రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. గిరిజన పల్లెల్లో మరిన్ని గురుకులాలను ప్రారంభించి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

04/19/2016 - 15:24

విశాఖ: ప్రస్తుత వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను నియమిస్తామని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఈ కమిటీలు సంక్షేమ పథకాలనూ పరిశీలిస్తాయన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలు ఎపుడు జరిగినా తమ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు.

04/19/2016 - 15:23

హైదరాబాద్: వైకాపా జిల్లా శాఖల అధ్యక్షులు, సమన్వయకర్తలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, మంచినీటి ఎద్దడి, రైతుల సమస్యలపై ఆయన పార్టీ నేతలతో చర్చించారు.

04/19/2016 - 15:22

విజయవాడ: గ్రామాలను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు కేంద్రం అధిక ప్రాధాన్యిత ఇస్తోందని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ మంగళవారం ఇక్కడ ప్రారంభమైన గిరిజన మహిళా సర్పంచ్‌ల జాతీయ సదస్సులో తెలిపారు. దేశ వ్యాప్తంగా 300 ఆదివాసీ గ్రామాలను, ఎపిలో 45 గిరిజన పల్లెలను కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. కేంద్రం నుంచి నేరుగా వస్తున్న నిధులను గ్రామపంచాయతీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Pages