S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2016 - 12:18

కడప: రాష్ట్ర విభజన వల్ల ఎపికి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నందున నిధులిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాల్సి ఉందన్నారు. ఆ హామీల అమలు కోసం అవసరమైతే కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

04/21/2016 - 12:18

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయంలో బుధవారం రాత్రి ఓ గర్భిణిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.

04/21/2016 - 12:17

అనంతపురం: ఎపి సిఎం చంద్రబాబు గురువారం అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా కదిరి మండలం కె.లోచర్ల వద్ద హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే జూన్‌లోగా పనులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆయన ఆదేశించారు.

04/21/2016 - 12:16

నెల్లూరు: సైదాపూరు మండలం కొమ్మిపాడు వద్ద గురువారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన 8మందిని ఆస్పత్రికి తరలించారు.

04/21/2016 - 10:56

హైదరాబాద్, ఏప్రిల్ 20: పులివెందులకు చివరికి దాహం తీర్చేది చంద్రబాబునాయుడేనని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ముద్దు కృష్ణమ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ 21 మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని పేర్కొంటూ వ్యాఖ్యానించిన జగన్ వాస్తవ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకుని మాట్లాడాలని అన్నారు.

04/21/2016 - 10:55

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో హిందూమత టూరిజం విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి డైరెక్టర్‌గా వి.రత్నకుమార్‌ను నియమిస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిలీజియస్ టూరిజం డైరెక్టర్‌గా రత్నకుమార్ మూడేళ్లపాటు కొనసాగుతారు.

04/21/2016 - 10:53

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అధికార టిడిపి ప్రభుత్వం అసెంబ్లీని తప్పుదోవపట్టించే విధంగా అంకెలు తారుమారు చేసి సరైన సమాచారం ఇవ్వలేదని, ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, కాగ్ దర్యాప్తు చేయాలని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత మేకపాటి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు.

04/21/2016 - 10:34

కడప,ఏప్రిల్ 20: గాలేరు-నగరి మొదటి దశ కింద ఈ ఏడాది డిసెంబర్ లోపు రైతులకు సాగు, తాగునీరు అందించి సీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చిన ఆయన సమీపంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

04/21/2016 - 10:32

శ్రీకాకుళం, ఏప్రిల్ 20: శ్రీకాకుళం జిల్లాలోని ఈస్ట్‌వెస్ట్ మినరల్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైమాక్స్) వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. ట్రైమాక్స్‌లో అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ విభాగం నివేదికలు ఇవ్వడంతో ప్రభుత్వం తాత్కాలికంగా అనుమతి రద్దుచేసింది. ఈ క్రమంలో చినబాబు లోకేష్ ట్రైమాక్స్ వ్యవహారంలో జోక్యం చేసుకుని నివేదిక కోరినట్లు సమాచారం.

04/21/2016 - 10:29

విజయనగరం, ఏప్రిల్ 20: శత్రురాజులు చేతులు కలిపారు. మారిన రాజకీయ పరిణామాలు సంస్థనాధీశులను ఒక్కటి చేశాయి. విజయనగరం, బొబ్బిలి రాజులకు తరాతరాలుగా ఉన్న వైరం ఉత్తరాంధ్ర వాసులకు తెలియంది కాదు. అనివార్యమైన రాజకీయ పరిస్థితులు వీరిని ఒక్కటి చేసినా గత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఈ నెయ్యం ఎన్నాళ్లు? అన్న సందేహాలున్నాయి.

Pages